నా పేరు సూర్య చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్


possitive-report-to-allu-arjun-naa-peru-surya-naa-illu-indiaఅల్లు అర్జున్ నటించిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్ వస్తోంది . వక్కంతం వంశీ దర్శకత్వంలో నాగబాబు – లగడపాటి శ్రీధర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం మే 4న విడుదల కానుంది . అల్లు అర్జున్ సరసన అను ఇమ్మాన్యు యేల్ నటిస్తోంది . మిలిటరీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ పూర్తిగా ఎమోషనల్ గా సాగే కథ కాదని కావలసినంత ఎంటర్ టైన్ మెంట్ కూడా ఉందని టాక్ .

అల్లు అర్జున్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు , ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు . సూర్య పాత్ర అల్లు అర్జున్ ని అమితంగా ఆకర్షించింది దాంతో ఒళ్ళు హూనం అయ్యేలా కష్టపడ్డాడు . ఇక ఈ సినిమా సూపర్ హిట్ అయి నేను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని ఆశిస్తున్నాడు అల్లు అర్జున్ . నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా పై మెగా ఫ్యాన్స్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు . చరణ్ నటించిన రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమాగా ఉన్నారు .