అల్లు అర్జున్ కోసం ప్రభాస్


prabhas guest for allu arjuns naa peru surya naa illu indiaస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు . ఇటీవల ట్రెండ్ మారింది , అగ్ర హీరోలు ఒకరి సినిమా ఫంక్షన్ కు మరొకరు రావడం అలవాటుగా మారింది ఆ ప్రక్రియలో భాగంగా మహేష్ కోసం ఎన్టీఆర్ భరత్ బహిరంగ సభకు వెళ్ళాడు కాగా ఇప్పుడు ప్రభాస్ వంతు వచ్చింది . అయితే ప్రభాస్ అల్లు అర్జున్ కోసం రానున్నాడు . అల్లు అర్జున్ తాజాగా నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .

షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తుచేసుకున్న ఈ చిత్రం మే 4న విడుదల కానుంది కాగా దానికి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఆ వేడుకకు ముఖ్య అథితి గా ప్రభాస్ వస్తున్నాడట . ఇలా అగ్ర హీరోలు కలిసి ఈవెంట్ లలో పాల్గొంటే చూసే అభిమానులకు మాత్రమే కాదు మిగతా ప్రేక్షకులు కూడా కిక్కే !