ప్రభాస్ నిహారిక ని పెళ్లి చేసుకోనున్నాడా


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది . ప్రభాస్ వయసు ఇప్పుడు 38 ఏళ్ళు , దాంతో అతడ్ని పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు అయితే బాహుబలి తర్వాత పెళ్లి అని ప్రకటించారు కానీ అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు . ఇప్పటికే పలువురు అమ్మాయిలు తెరమీదకు వచ్చారు కాగా తాజాగా మెగా డాటర్ నిహారిక ని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి .
నాగబాబు కూతురు అయిన నిహారిక ఒక మనసు అనే చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది , అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు ప్రస్తుతం సైరా …… నరసింహారెడ్డి చిత్రంలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే అనూహ్యంగా ప్రభాస్ నిహారిక ల పెళ్లి తెరమీదకు వచ్చింది . అసలు అనుష్క తో ప్రభాస్ ఎక్కువ సినిమాలు చేసాడు కాబట్టి ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు అంటూ పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి అవన్నీ గాలి వార్తలే ఎందుకంటే మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే ! అని ప్రకటించారు . ఈ వార్తల విషయం ఎలా ఉన్నప్పటికీ ప్రభాస్ పెళ్లి మాత్రం పెద్దనాన్న కృష్ణంరాజు కు పెద్ద తలనొప్పి గా మారింది .