ప్రభుదేవా – నికిషా పటేల్ ల పెళ్లా


prabhudeva nikisha patel marriage news goes viral డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవా -హీరోయిన్ నికిషా పటేల్ లు పెళ్లి చేసుకోనున్నారా ? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి . కొమరం పులి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది నికిషా పటేల్ . అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో పాపం పెద్ద స్టార్ అవుదామని వచ్చిన ఈ భామని తెలుగులో పట్టించుకోవడమే మానేశారు అయితే పవన్ సరసన నటించింది కాబట్టి అడపా దడపా ఈ భామకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి .

ఇక ప్రభుదేవా తో ఈ భామకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి , దాంతో పెళ్లి అంటూ గుసగుసలు మొదలయ్యాయి . ప్రభుదేవా కు ఎప్పుడో పెళ్లయ్యింది ఇద్దరు పిల్లలు కూడా పైగా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా . అయితే నయనతార ని ప్రేమించడం వల్ల భార్య రామాలత్ కు విడాకులు ఇచ్చాడు . ఇక నయనతార తో పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఆ పెళ్లి పెటాకులు అయ్యింది . దాంతో అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ప్రభుదేవా . అయితే ఇప్పుడు మాత్రం ప్రభుదేవా – నికిషా పటేల్ ల పెళ్లి అంటూ గుసగుసలు మొదలయ్యాయి .