దబాంగ్ 3 కి దర్శకుడు ఎవరో తెలుసా


దబాంగ్ సిరీస్ లో వచ్చిన దబాంగ్ , దబాంగ్ 2 రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో తాజాగా ఆ సిరీస్ లో సినిమా వస్తోంది అంటే అంచనాలు ఆకాశాన్ని అంటడం ఖాయం . సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ లో అలాగే దబాంగ్ 2 లో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటించింది అయితే మొదటి చిత్రానికి అభినవ్ కశ్యప్ దర్శకత్వం వహించగా దబాంగ్ 2 కి సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ దర్శకత్వం వహించాడు .

కట్ చేస్తే ఇప్పుడు దబాంగ్ 3 కి దర్శకుడు ఎవరు ? అన్న చర్చ మొదలయ్యింది అయితే ఆ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టాడు ప్రభుదేవా . తెలుగులో అలాగే తమిళ్ లో పలు చిత్రాల్లో నటించి కొరియోగ్రాఫర్ గా విశేష ప్రాచుర్యం పొందిన ప్రభుదేవా పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు . అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన వాంటెడ్ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించాడు కూడా . మళ్ళీ ఇన్నాళ్లకు సల్మాన్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ప్రభుదేవా కు లభించింది . దాంతో ఈ సినిమాపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి .