యాంకర్ ప్రదీప్ కు తగిన శిక్ష పడింది


డిసెంబర్ 31 అర్ధరాత్రి తప్పతాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు యాంకర్ ప్రదీప్. అయితే కౌన్సెలింగ్ కి ఇన్ని రోజులుగా హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రదీప్ ఎట్టకేలకు ఈరోజు కోర్టు ముందు హాజరు అయ్యాడు. 178 పాయింట్లతో మోతాదు మించి ఉండటంతో పాటు సమయానికి హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు అతడి డ్రైవింగ్ లైసెన్సు ని 3 ఏళ్ల పాటు రద్దు చేసింది. అంతేకాదు 2100 జరిమానా కూడా విధించింది కోర్టు.

 

3 ఏళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్స్ ని రద్దు చేయడంతో మూడేళ్ళ పాటు ప్రదీప్ డ్రైవ్ చేయడానికి వీలు కాదు కాని ప్రదీప్ దాన్ని పాటిస్తాడా చూడాలి. ఆ విషయాన్ని పక్కన పెడితే మళ్లీ నీతులు అయితే చెబుతున్నాడు ప్రదీప్. తప్పు చేశాను ,ఆరోజు డ్రైవర్ లేకపోవడంతో నేను డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది . ఇకపై అలాంటి తప్పు చేయను అంటూ పాటించని నీతులు అయితే చెబుతున్నాడు మరి.