హమ్మయ్య ! హిట్టు కొట్టేసిన పూరి


puri jagannadh mehbooba hit talkహమ్మయ్య ! ఎట్టకేలకు పూరి జగన్నాధ్ హిట్ కొట్టేసాడు . పూరి జగన్నాధ్ హిట్ కొట్టలేక పోతున్నాడు గతకొంత కాలంగా పైగా తీస్తున్న సినిమాలన్నీ డిజాస్టర్ లు అవుతున్నాయి కూడా . దాంతో చావో రేవో తేల్చుకోవాలని భావించిన పూరి తన తనయుడిని హీరోగా మరోసారి పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ” మెహబూబా ” . ఈరోజు విడుదలైన మెహబూబా మొత్తానికి కుర్రాళ్లకు బాగా నచ్చింది దాంతో మొదటి రోజునే హిట్ టాక్ వచ్చింది మెహబూబా చిత్రానికి .

ఇంటి ని సైతం తాకట్టు పెట్టి కొడుకుతో రూపొందించిన మెహబూబా చిత్రంతో హిట్ కొట్టడంతో దర్శకులు పూరి జగన్నాధ్ చాలా సంతోషంగా ఉన్నాడు . 2015 లో ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ మాత్రమే హిట్ అయ్యింది దాని తర్వాత పూరి జగన్నాధ్ 5 సినిమాలు చేసాడు ఆ అయిదు సినిమాలు కూడా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో ఇక పూరి పని అయిపోయినట్లే అని అనుకున్నారు . పైగా అగ్ర హీరోలు పూరి జగన్నాధ్ కు డేట్స్ ఇవ్వడానికి జంకడంతో తన తనయుడు పూరి ఆకాష్ ని హీరోగా మెహబూబా చిత్రం చేసాడు . కట్ చేస్తే మెహబూబా చిత్రానికి హిట్ టాక్ రావడంతో పూరి జగన్నాధ్ మళ్ళీ హిట్ బాట పట్టినట్లే అని అంటున్నారు .