కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్న పూరి


director puri jagannadh sold his house for puri akashదర్శకులు పూరి జగన్నాధ్ మరోసారి ఇల్లు అమ్ముకున్నాడు , అయితే ఈసారి కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్నాడు . వరుసగా ఘోరమైన పరాజయాలు పూరి జగన్నాధ్ ని వెంటాడటంతో చేసేది లేక అగ్ర హీరోలు డేట్స్ ఇవ్వకపోవడంతో తాన్ కొడుకు ని హీరోగా నిలబెట్టడానికి ……. దర్శకుడిగా మళ్ళీ తన సత్తా ఏంటో చాటడానికి ఈ సాహసం చేసాడు పూరి జగన్నాధ్ . కొడుకు పూరి ఆకాష్ ని హీరోగా రెండోసారి పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ” మెహబూబా ”.

ఈనెల 11న మెహబూబా చిత్రాన్ని విడుదల చేయనున్నారు . సినిమా ని అగ్ర నిర్మాత దిల్ రాజు కి చూపించారు అది నచ్చడంతో దిల్ రాజు విడుదల చేస్తున్నాడు . సినిమా హిట్ అయితే అటు హీరోగా పూరి ఆకాష్ కు దర్శకుడిగా ఇటు పూరి జగన్నాధ్ కు ఇద్దరికీ కలిసి వస్తుంది లేదంటే మళ్ళీ ఆర్ధిక ఇబందులు తప్పవు . అయితే మెహబూబా చిత్రంతో మళ్ళీ పూరి జగన్నాధ్ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు దిల్ రాజు . హిట్ కొట్టకపోయినా హీరోగా పూరి ఆకాష్ మాత్రం ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు . పూరి భవిష్యత్ ఏంటన్నది ఈనెల 11న తేలిపోనుంది .