బీచ్ లో బికినీ కాకపోతే ఏం వేసుకోవాలి


radhika-apte-sensational-comments-on-bikiniబీచ్ లో బికినీ కాకపోతే ఏం వేసుకోవాలి , చీర కట్టుకోవాలా ? చీర తో బీచ్ కి వెళతారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వివాదాస్పద నటి రాధికా ఆప్టే . తెలుగులో పలు చిత్రాల్లో నటించి తెలుగు అగ్ర హీరో పై సంచలన ఆరోపణలు చేసి ప్రకంపనలు సృష్టించిన భామ ఈ రాధికా ఆప్టే . పెళ్లి అయినప్పటికీ నగ్నంగా నటించి అందరికీ షాక్ ఇచ్చిన రాధికా ఆప్టే తాజాగా బికినీ కోసం వీరంగం వేసింది . బీచ్ లో బికినీ లు వేసుకోకుండా చీరలు కట్టుకోవాలా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది .

 

బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ తెలుగు , తమిళ చిత్రాల్లో కూడా నటించింది . అయితే తమిళ్ లో రజనీకాంత్ సరసన నటించిన ఈ భామ రజనీ పొగడ్తలతో ముంచెత్తి తెలుగు సినిమాలను మాత్రం ఘోరంగా అవమానించింది . నన్ను పక్కలోకి రమ్మని చాలా వేధించారని కానీ నేను లొంగలేదని గట్టిగా బుద్ది చెప్పానని ఘాటు వ్యాఖ్యలే చేసింది రాధికా ఆప్టే .