డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారుతున్న హాట్ భామ


rakshitha turned dubbing artisteఇడియట్ చిత్రంతో అప్పట్లో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన హాట్ భామ ” రక్షిత ”. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఇడియట్ చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన రక్షిత అప్పట్లో ఓ ఊపు ఊపేసింది . తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ కన్నడ భామ అక్కడ కూడా పలు చిత్రాల్లో నటించింది కట్ చేస్తే దర్శకుడు ప్రేమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటోంది .

పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసిన రక్షిత తాజాగా మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది అయితే ఇప్పుడు ఈ భామ నటిగా రావడం లేదు సుమా ! పెళ్లి కావడంతో బాడీ ఫిట్ నెస్ కోల్పోయి చాలా లావయ్యింది దాంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టర్న్ అవుతోంది . ఆ డబ్బింగ్ కూడా చెప్పేది ఎవరికో తెలుసా హాట్ భామ ” అమీ జాక్సన్ ” కు తన వాయిస్ ఇస్తోంది ఈ మాజీ హాట్ . తాజాగా అమీ జాక్సన్ కన్నడ ” విలన్ ” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కాగా అమీ జాక్సన్ పాత్రకు రక్షిత డబ్బింగ్ చెప్పింది . ఒక హాట్ భామకు ఇంకో హాట్ భామ వాయిస్ ఇచ్చేసింది . చాలా గమ్మత్తుగా ఉందట డబ్బింగ్ చెప్పడం , నా పని అయితే కంప్లీట్ చేశాను …… ఎలా చెప్పానో సినిమా చూసి చెప్పండి అంటోంది రక్షిత .