రంగస్థలం 26 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్


rangasthalam-26-days-world-wide-collectionsరాంచరణ్ నటించిన రంగస్థలం 200 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది . మార్చి 30న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన రంగస్థలం చిత్రానికి మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది . సినిమా నిడివి ఎక్కువ ఉన్నప్పటికీ చరణ్ నటనకు ముగ్దులయ్యారు ప్రేక్షకులు . చరణ్ తో పాటుగా సమంత నటనకు కూడా ఫిదా అయ్యారు అలాగే అనసూయ కు కూడా చాలామంచి పాత్ర లభించింది . ముఖ్యంగా 1980 కాలం నాటి కథ కావడంతో ప్రేక్షకులు లీనమైపోయారు రంగస్థలం చిత్రంలో .

మొదటి రోజు నుండే భారీ వసూళ్ల ని సాధించిన రంగస్థలం చిత్రానికి వేసవి సెలవులు కూడా తోడవ్వడంతో కలెక్షన్ల సునామీ సృష్టించింది . నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది రంగస్థలం . 26 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల మైలురాయి ని అందుకుంది రంగస్థలం . దాంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా , భారీ వసూళ్లు కూడా సాధిస్తుండటంతో చరణ్ కు రంగస్థలం మెమొరబుల్ అయ్యింది .