రంగస్థలం హిట్ అయ్యేలాగే ఉంది


రాంచరణ్ నటించిన రంగస్థలం ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా మంచి హిట్ అయ్యే సినిమా లాగే కనిపిస్తోంది . గ్రామీణ వాతావరణాన్ని చక్కగా క్యాప్చర్ చేయడమే కాకుండా కావలసినంత యాక్షన్ ని కూడా కురిపించారు . సమంత గ్రామీణ యువతిగా బాగా కుదిరింది అలాగే చరణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ! సుకుమార్ టేకింగ్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వెరసి రంగస్థలం ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ సినిమా అనిపిస్తోంది .

 

మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రంగస్థలం చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం . ఇక ఈ సినిమాలో హాట్ భామ అనసూయ కూడా ఓ కీలక పాత్ర పోషించింది . మైత్రి మూవీస్ సంస్థ నిర్మించిన ఈ రంగస్థలం అటు సుకుమార్ కు ఇటు చరణ్ కు అలాగే సమంత కు మరింత మంచి పేరు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది .