పెళ్ళైతే హీరోయిన్ గా పనికిరామా అని ప్రశ్నిస్తోంది


rani mukherjee gets superhit in re entryపెళ్ళైతే హీరోయిన్ గా పనికిరామా ? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తోంది పెళ్లైన భామ రాణీ ముఖర్జీ . హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ 40 ఏళ్ల భామ 2014 లో ఆదిత్య చోప్రా అనే నిర్మాత ని పెళ్లి చేసుకొని కాపురం చేసుకుంటూ కొంతకాలం సినిమాలకు దూరమయ్యింది . అయితే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనీ భావించిన ఈ భామ ” మర్దానీ ” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు దాంతో కసితో ఈసారి ” హిచ్కీ ” అనే సినిమా చేసింది .

అయితే ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది దాంతో ఆత్మవిశ్వాసం మరింత పెరగడంతో హీరోయిన్ లకు పెళ్లి కాగానే హీరోయిన్ లుగా పనికి రారని తేల్చేస్తున్నారు అప్పటికి ఇప్పటికి మాలో తేడా ఏంటి ? అదే హీరోలకు అయితే మరో న్యాయమా ? మాకు వ్యక్తిగత జీవితం అవసరం లేదా ? పెళ్ళైతే హీరోయిన్ గా పనికిరామా ? అంటూ ప్రశ్నిస్తోంది రాణీ ముఖర్జీ .