అర్జున్ రెడ్డి ని తిరస్కరించిన హీరో


అర్జున్ రెడ్డి చిత్రంలో నేను నటించడం లేదని ఆ ఆఫర్ ని తిరస్కరించాడు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ . తెలుగులో సంచలన విజయం సాధించడమే కాకుండా అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరు తెచ్చుకుంది అర్జున్ రెడ్డి చిత్రం . విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రానికి  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు . తెలుగులో బ్లాక్ బస్టర్ కావడంతో ఈ చిత్రాన్ని ఇతర బాషలలో రీమేక్ చేయడానికి పోటీ పడుతున్నారు . ఆల్రెడీ తమిళ్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడు పోగా హిందీలో కూడా రీమేక్ చేయాలనీ భావించాడు సందీప్ రెడ్డి వంగా .

అందుకే బాలీవుడ్ లో పలువురు హీరోలను కలిసి సంప్రదించగా రణవీర్ సింగ్ ఈ కథ విన్నాక హీరో క్యారెక్టర్ ఆల్కహాలిక్ కాబట్టి నేను నటించను ఎందుకంటే నేను మద్యం ముట్టను అని ఓ చెత్త కారణం చెప్పాడట రణవీర్ దాంతో చేసేది లేక మరో హీరో వేటలో పడ్డాడు సందీప్ . మద్యం ముట్టను కాబట్టి ఆ సినిమాలో నటించను అని చెప్పడం మరీ విడ్డూరంగా ఉంది కదూ !