రష్మీ – సుడిగాలి సుధీర్ ల పెళ్లి వీడియో


యాంకర్ రష్మీ జబర్దస్త్ సుడిగాలి సుధీర్ ల మధ్య ఏదో ఉందని గతకొంతకాలంగా రకరకాల పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే . అయితే ఎప్పటికప్పుడు మా మధ్య అటువంటి దేమి లేదు అని ఈ ఇద్దరూ ఖండిస్తున్నప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు సరికదా మరింతగా ఎక్కువ అవుతున్నాయి . తాజాగా రష్మీ – సుధీర్ ల పెళ్లి వీడియో అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది .

 

పెళ్లి కూతురు గెటప్ లో రష్మీ పెళ్లి కొడుకు గెటప్ లో సుధీర్ లు రెడీ అయిన తీరుకి ఖచ్చితంగా ఈ ఇద్దరికీ పెళ్లి అయ్యిందని గుసగుసలు మొదలయ్యాయి . అయితే అసలు విషయం ఏంటంటే …….. ఓ ఛానల్ లో నిర్వహిస్తున్న షోలో భాగంగా ఈ పెళ్లి తంతు కానిచ్చారు దాని తాలూకు ప్రోమో లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి . త్వరలో ఉగాది సందర్భాన్ని పురస్కరించుకొని ప్రసారం కానుంది ఈ ఎపిసోడ్ అదీ అసలు విషయం .