ప్లాప్ తో ఖంగుతిన్న రవితేజ


నిన్న రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం రిలీజ్ అయ్యింది , అయితే మార్నింగ్ షో నుండే ప్లాప్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా . రవితేజ సినిమాని టచ్ చేసి చూడొద్దు ఎందుకంటే తుస్సే అంటూ అప్పుడే పేరడీలు మొదలు పెట్టారు . రవితేజ సినిమాకు ప్లాప్ టాక్ రావడం నాగశౌర్య సినిమాకు బాగా కలిసొచ్చింది . నిన్న నే రిలీజ్ అయినా ఛలో చిత్రానికి పాజిటివ్ టాక్ తొందరగా స్ప్రెడ్ అయ్యింది దాంతో ఆ సినిమా కలెక్షన్లు మరింతగా పుంజుకునే అవకాశం ఉంది .

రవితేజ కొంతకాలం గ్యాప్ తర్వాత చేసిన రాజా ది గ్రేట్ చిత్రం హిట్ కావడంతో ఈ టచ్ చేసి చూడు చిత్రంపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యింది రవితేజ టచ్ చేసి చూడు . కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్టాఫ్ బాగానే ఉన్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా తేలిపోయింది . అయితే రవితేజ బిసి కేంద్రాల్లో కొంత ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఈ వారం రోజులు నెట్టుకు రాగలదు అని భావిస్తున్నారు .