రికార్డుల వేట మొదలుపెట్టిన ప్రభాస్


record price for prabhas saahoయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సినిమా సాహో తో అప్పుడే రికార్డుల మోత మోగిస్తున్నాడు . బాహుబలి పుణ్యమా అని ప్రభాస్ కు ఎక్కడా లేని క్రేజ్ రావడంతో సాహో చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . దానికి తోడూ ప్రభాస్ చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ , జాకీష్రాఫ్ , నీల్ నితిన్ ముఖేష్ , చుంకీ పాండే , మందిరా బేడీ లు నటిస్తుండటం వల్ల ఈ సినిమాని బాలీవుడ్ లో సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు .

 

ఆ పోటీ వల్ల 120 కోట్ల ధర పలికింది . ఏరియా హక్కులతో పాటుగా హిందీ శాటిలైట్ హక్కుల రూపంలో ఈ మొత్తం ఆఫర్ రావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉంది . సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది అయినప్పటికీ రికార్డుల వేట మొదలయ్యింది . ప్రస్తుతం ఈ చిత్రం దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది .