మహేష్ -అల్లు అర్జున్ లకు బ్యాడ్ టైం


release-doubt-for-mahesh-and-allu-arjunమహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను చిత్రాన్ని అలాగే అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాన్ని కూడా ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నాం అంటూ పోటాపోటీగా ప్రకటనలు జారీ చేసారు , అసలు ఒకదశలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు కానీ ఇప్పుడు ఎవరో ఒకరు లేదంటే ఇద్దరు కూడా పోటీ నుండి పక్కకు తప్పుకునేలా చేస్తున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ . ధనుష్ నిర్మిస్తున్న ” కాలా ” చిత్రాన్ని ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు . రజనీకాంత్ నటించిన సినిమాలు ఈమధ్య పెద్దగా ఆడలేదు కానీ అతడి క్రేజ్ మాత్రం తగ్గలేదు దాంతో కాలా చిత్రానికి బాగానే డిమాండ్ ఉంది .

రజనీకాంత్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది కాబట్టి అదే రోజున మహేష్ బాబు , అల్లు అర్జున్ ల సినిమాలు విడుదల అయితే తప్పకుండా థియేటర్ ల సమస్య ఎదురుఅవుతుంది కాబట్టి మహేష్ – అల్లు అర్జున్ లలో తప్పకుండా ఎవరో ఒకరు లేదా ఇద్దరు హీరోలు ఒక వారం రజనీకాంత్ కోసం వెయిట్ చేయాల్సిందే .