Home రివ్యూస్ ఆటాడుకుందాం రా రివ్యూ - Aatadukundam Raa Movie Review
టాలీవుడ్
 రివ్యూస్

ఆటాడుకుందాం రా రివ్యూ - Aatadukundam Raa Movie ReviewFriday August 19th 2016

Aatadukundam Raa Movie Review

Rating:

2.25/5

Direction:

G. Nageswara Reddy

Producer:

A Naga Suseela and Chintalapudi Srinivasa Rao

Written by:

Sreedhar Seepana

Star Cast :

Sushanth, Sonam Bajwa

Music :

Anup Rupens

Production
company:

Sri Nag Corporation and Sri G Films

Release date:

19th August 2016

Genre:

Drama film/Action

Censor:

U/A

 

 

వినోద ప్రధాన చిత్రాలను తెరకెక్కించే జి . నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సుశాంత్ హీరోగా చింతలపూడి శ్రీనివాస్ - నాగ శుశీల సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''ఆటాడుకుందాం ....రా '' . ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 

Editor Review

కథ :విజయ్ రాం (మురళీశర్మ ) ఆనంద్ ప్రసాద్  (ఆనంద్ ) లు ఇద్దరు కూడా మంచి స్నేహితులు . అయితే విజయ్ రాం ని ఓడించాలని అతడి బద్ద శత్రువైన శాంతారాం ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో అతడి స్నేహితుడిని అడ్డం పెట్టుకొని దెబ్బ తీస్తాడు . అయితే విజయ్ మాత్రం ఆనంద్ వల్లే నేను నష్టపోయాను అని బ్రమించి అతడ్ని వెల్లగొడతాడు . ఆస్థులు పోయి మద్య తరగతి జీవితం గడుపుతున్న విజయ్ రాం కు ఆధారమైన రైస్ మిల్లు ని కూడా తమ్ముడి కూతురు పెళ్లి కోసం అమ్మకానికి పెడతాడు . ఆ సమయంలో అమెరికా నుండి వస్తాడు కార్తీక్ ( సుశాంత్ ) . విజయ్ రామ్ కుటుంబం మళ్ళీ ఆస్థిపరులు కావడానికి కార్తీక్ చేసిన పనులేంటి ? అసలు కార్తీక్ ఎవరు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
30 ఇయర్స్  పృథ్వీ
నిర్మాణ విలువలు

డ్రా బ్యాక్స్ : 
కథ
కథనం
డైరెక్షన్

నటీనటుల పెర్ఫార్మెన్స్ :
కార్తీక్ పాత్రలో సుశాంత్ బాగానే నటించాడు . డ్యాన్స్ లలో అలాగే ఫైట్స్ లలో కూడా భేష్ అనిపించాడు . ఇక లుక్స్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు . ఇక కామెడి విషయానికి వస్తే ఈ సినిమాలో పెద్ద రిలీఫ్ 30 ఇయర్స్ పృథ్వీ . అతడు ఉన్నంత వరకు నవ్వులు పూయించాడు . హీరోయిన్ అంతగా ఆకట్టుకోలేక పోయింది . ఇక మిగిలిన పాత్రలలో పోసాని , మురళీశర్మ , ఆనంద్ లు తమ తమ పాత్రల పరిది మేరకు నటించారు . బ్రహ్మానందం మరోసారి నవ్విన్చాబోయి చతికిల బడ్డాడు .

సాంకేతిక వర్గం : 
శ్రీధర్ సీపాన అందించిన కథలో ఏమాత్రం కొత్తదనం లేదు , ఇక స్క్రీన్ ప్లే కూడా అంతగా ఆకట్టుకునే విధంగా మలచ లేకపోయారు . కామెడి మీద మంచి పట్టున్న దర్శకులు జి. నాగేశ్వర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు అంటే నమ్మలేం . దర్శకత్వ విభాగం లో పూర్తిగా విఫలమయ్యాడు నాగేశ్వర్ రెడ్డి . నిర్మాణ విలువలు బాగున్నాయి . అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం కూడా యావరేజ్ గా ఉంది .

ఓవరాల్ గా :
నాగచైతన్య కొద్దిసేపు కనిపించడం , అఖిల్ ఓ పాటలో మెరవడం , పృథ్వీ కామెడి ఇలా కొన్ని అంశాలలో మాత్రమే ఆటాడు కుందాం రా లో కనిపించే ప్లస్ . అయితే సినిమా మొత్తం ఏమాత్రం ఆసక్తి లేని కథ , అంతకుమించిన నీరసం తో సాగే కథనం తో మొత్తానికి ప్రేక్షకులతో ఆటాడుకున్నాడు దర్శకుడు.

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD