అర్జున్ రెడ్డి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

అర్జున్ రెడ్డి రివ్యూ

Murali R | Published:August 31, 2017, 12:00 AM IST

నటీనటులు       : విజయ్ దేవరకొండ , షాలిని పాండే , రాహుల్ రామకృష్ణ తదితరులు

సంగీతం           : రధన్

నిర్మాత             : ప్రణయ్ రెడ్డి

దర్శకత్వం        : సందీప్ రెడ్డి

రేటింగ్              :  3/5

రిలీజ్ డేట్         : 25 ఆగస్టు 2017


 

Editor Review
పెళ్లి చూపులు చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో  నటించిన చిత్రం '' అర్జున్ రెడ్డి ''. రిలీజ్ కి ముందే వివాదాస్పదం అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
మెడికల్ స్టూడెంట్ అయిన అర్జున్ రెడ్డి ( విజయ్ దేవరకొండ ) కు కాస్తంత ఆవేశం ఎక్కువే ! తన జూనియర్ అయిన ప్రీతి ( షాలిని పాండే ) ని ప్రేమిస్తాడు . ప్రీతి కూడా అర్జున్ ని ప్రేమిస్తుంది కట్ చేస్తే వీళ్లిద్దరి పెళ్ళికి ప్రీతి తండ్రి అడ్డు రావడమే కాకుండా ప్రీతి ని మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తాడు . దాంతో అర్జున్ రెడ్డి భగ్న ప్రేమికుడౌతాడు . డాక్టర్ కావాలనుకున్న అర్జున్ రెడ్డి భగ్న ప్రేమికుడి గానే మిగిలిపోయాడా ? చివరకు తన ప్రేమ కోసం ఏం చేసాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ 
ఎంటర్ టైన్మెంట్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
సెకండాఫ్ 
సినిమా నిడివి 
అనవసరపు సన్నివేశాలు 
 
నటీనటుల ప్రతిభ : 
 
ఆవేశపరుడిగా , ప్రేమికుడిగా , భగ్న ప్రేమికుడిగా తన పాత్రలో వేరియేషన్స్ చూపించి మంచి మార్కులు కొట్టేసాడు విజయ్ దేవరకొండ . తక్కువ సమయంలోనే ఇలాంటి విభిన్న పార్శ్వాలు ఉన్న పాత్ర లభించడం , దాన్ని సద్వినియోగం చేసుకోవడం విజయ్ దేవరకొండ చేసుకున్న అదృష్టం . హీరోయిన్ గా షాలిని పాండే ఆకట్టుకుంది , తన పాత్ర పరిధి మేరకు బాగానే నటించింది . ఇక ఈ ఇద్దరి తర్వాత పూర్తి మార్కులు రాహుల్ రామకృష్ణ దే . తెలంగాణ యాసలో బాగా ఆకట్టుకున్నాడు రాహుల్ . ఇక మిగిలిన పాత్రల్లో కమల్ కామరాజ్ , సంజయ్ స్వరూప్ , కళ్యాణ్ లు తమతమ పాత్రల్లో మెప్పించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
సంగీత దర్శకుడు రధన్ అర్జున్ రెడ్డి తో ఆకట్టుకున్నాడు , రీ రికార్డింగ్ తో అలాగే పాటలతో అలరించాడు . ఛాయాగ్రహణం , నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి ,అయితే ఎడిటింగ్ విషయంలోనే ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది సెకండాఫ్ లో చాలా సన్నివేశాలకు కత్తెర వేస్తే మరింత బాగుంటుంది . ఇక దర్శకులు విషయానికి వస్తే ....... పక్కాగా కుర్రకారు కి కావలసిన సినిమాని అందించాడు . అతడు మొదటి నుండి చెబుతున్నట్లుగానే కుర్రాళ్ళని టార్గెట్ చేసాడు . సినిమా చూసేది వాళ్ళు , లవ్ ని ఎంజాయ్ చేస్తున్నది వాళ్ళు కాబట్టి అతడి టార్గెట్ రీచ్ అయినట్లే . 
 
ఓవరాల్ గా : యూత్ కోసమే ఈ........  అర్జున్ రెడ్డి

Comments

LATEST GALLERY


Mahanubhavudu Movie Pre Release Function


Tamannaah Latest Stills


Rachana Choudary Marriage Photos


Jai Lava Kusa New Movie Walls


Catherine & Vijay launch KLM Fashion Mall at Kukatpally


Robo 2.0 3D Digital Meet


Spyder Movie 4 Days To Go Posters


Balakrishnudu Movie New Posters


Japanese Film Festival Launch


Mahanubhavudu Movie New Posters


Oxygen Movie New Stills


Nandini New Photos


Amrutha New Photos


Madhumitha Krishna New Gallery


Anu Emmanuel Latest Stills

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD