అత్తారిల్లు రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

అత్తారిల్లు రివ్యూ

Monday September 19th 2016


నటీనటులు : సాయి రవికుమార్ ,అథితి దాస్ తదితరులు
సంగీతం : మణిశర్మ
నిర్మాత ,దర్శకత్వం : అంజన్ కే కళ్యాణ్
రేటింగ్ : 2.5 / 5
రిలీజ్ డేట్ : 16 సెప్టెంబర్ 2016





హర్రర్ చిత్రాలు విజయాలు సాధిస్తుండటంతో ఆ చిత్రాల హవా కొనసాగుతోంది . దర్శకత్వ శాఖలో పలువురి దగ్గర శిష్యరికం చేసిన అంజన్ కే కళ్యాణ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చేసిన ప్రయత్నమే ఈ ''అత్తారిల్లు ''. అంతా కొత్తవాళ్ల తో చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయ్యిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 



 

Editor Review

కథ :
రాజకీయనాయకుడు అయిన రామానంద్ తనయుడు దయానంద్ కు తెల్లవారు జామున ఓ  కల వస్తుంది , ఆ కలలో తనకి పెళ్లి అయినట్లు శోభనం రోజున భార్య చనిపోయి దెయ్యం అయినట్లు ఇక పెళ్లి చేసుకుంటే ఆ దెయ్యం వచ్చి చంపుతుందని భయపడి పోతుంటాడు . అయితే దయ స్నేహితుడు రణదీర్ ( సాయి రవికుమార్ ) అత్తారిల్లు అనే దెయ్యం స్క్రిప్ట్ ని పట్టుకొని డైరెక్షన్ చాన్స్ కోసం తిరుగుతుంటాడు . రణదీర్  జ్వాల ( అథితి దాస్ ) అనే హీరోయిన్ తో ప్రేమాయణం సాగిస్తుంటాడు . రణదీర్ కథ నచ్చిన ఓ నిర్మాత దాని రిహార్సల్స్ కోసం ''అత్తారిల్లు '' కు తన మిత్రులతో కలిసి వెళతాడు రణదీర్ . అయితే అక్కడికే జ్వాల కూడా వస్తుంది . అత్తారిల్లు లో రిహార్సల్స్ చేస్తున్న సమయంలో రకరకాల సంఘటనలు జరుగుతాయి దాంతో అక్కడ దెయ్యం ఉందని అదే అక్కడున్న మనుషులను చంపుతోందనే విషయం తెలుసుకుంటారు . అసలు దెయ్యం ఎవరు ? జ్వాల కు దెయ్యానికి సంబంధం ఏంటి ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ : 
ఫస్టాఫ్

డ్రా బ్యాక్స్ :

సెకండాఫ్
రొటీన్ స్టొరీ

నటీనటుల ప్రతిభ :
రణదీర్ పాత్రలో సాయి రవికుమార్ మెప్పించాడు , జ్వాల గా అథితి దాస్ ఆకట్టుకుంది  . గ్లామర్ ని పండించడమే కాకుండా కాస్తంత అభినయం తో ఆకట్టుకుంది . ఇక మిగిలిన పాత్రల్లో కృష్ణమూర్తి పాత్రలో నవ్వులు పంచాడు కొత్త నటుడు అలాగే మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు .

సాంకేతిక వర్గం :
ఛాయాగ్రహణం ఫరవాలేదు , పాటలు యావరేజ్ గా ఉన్నాయి మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది . ఇక దర్శకులు అంజన్ కే కళ్యాణ్ విషయానికి వస్తే కథ , స్క్రీన్ ప్లే , మాటలు మాత్రమే కాకుండా తనే నిర్మించాడు . సాధారణ కథ ,అంతే సాధారణ స్క్రీన్ ప్లే జోడించాడు ................. మరికాస్త గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది . భయపెట్టాలని ,నవ్వించాలని తెగ తాపత్రయ పడ్డాడు కానీ ఆ విషయంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేక పోయాడు . నిర్మాణ విలువలు ఫరవాలేదు .

ఓవరాల్ గా :
హర్రర్ కథాంశం తో తెరకెక్కిన ఈ అత్తారిల్లు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చడం కష్టమే ! అయితే ఫస్టాఫ్ ని కొంతవరకు బాగానే హ్యాండిల్ చేసిన అంజన్ సెకండాఫ్ కు వచ్చేసరికి తేలిపోయాడు . దెయ్యం ఎపిసోడ్ పేలాల్సింది పోయి ఎబ్బెట్టు గా అనిపించింది . అయితే అనుకున్న స్థాయిలో కాకపోయినా కొంతవరకు బాగానే హ్యాండిల్ చేయగలిగాడు . హర్రర్ చిత్రాలు కోరుకునే ప్రేక్షకులకు అత్తారిల్లు నచ్చవచ్చు .


Comments

LATEST GALLERY


Project C 420 Movie Opening Photos


Tanya Hope Photoshoot Photos


Mahanubhavudu Movie Trailer Launch


Mehreen Pirzada New Stills


Next Nuvve Movie Pressmeet


Tanya Hope New Stills


Spyder Movie Stills


Sharabha Movie Trailer launch


Rashmi Gautam New Photos


Mishti Chakravarty New Photos


Jai Lavakusa Movie 3 Days To Go Posters


Dr. T. Subba RamiReddy Birth Day Celebrations


Jai Lava Kusa Movie Stills


ANR National Awards Event Photos


Raashi Khanna Latest Photo Shoot

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD