Home రివ్యూస్ బ్లాక్ మనీ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

బ్లాక్ మనీ రివ్యూ



Friday April 21st 2017

నటీనటులు : మోహన్ లాల్ , అమలా పాల్ తదితరులు 
సంగీతం : రితీష్ వేగ 
నిర్మాత : నిజాముద్దీన్ 
దర్శకత్వం : జోషి 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 21 ఏప్రిల్ 2017


 

Editor Review
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ - అమలా పాల్ నటించిన మలయాళ చిత్రాన్ని తెలుగులో '' బ్లాక్ మనీ '' పేరుతో డబ్ చేసారు . గతకొంత కాలంగా తెలుగులో వరుసగా మోహన్ లాల్ చిత్రాలు వస్తూ హిట్ కొడుతుండటంతో ఈ సినిమా పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి . ఈరోజు రిలీజ్ అయిన బ్లాక్ మనీ తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ
 
వేణు ( మోహన్ లాల్ ) ఓ వీడియో జర్నలిస్ట్ స్టింగ్ ఆపరేషన్ లో దిట్ట అయిన వేణు భరత్ టివి రిపోర్టర్ అయిన రేణుక ( అమలా పాల్ ) తో కలిసి ఓ స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఉన్న బ్లాక్ మనీ గురించిన రహస్యం తెలుస్తుంది . స్టింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న సమయంలో ఇద్దరూ ప్రేమలో పడతారు వేణు - రేణుకలు అయితే అయితే విచిత్రంగా అదే స్టింగ్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య అపోహలు వచ్చి విడిపోతారు . వేణు - రేణుక లు విడిపోవడానికి కారణం ఏంటి ? చివరకు ఒక్కటయ్యారా ? బ్లాక్ మనీ సంగతి ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్
 
మోహన్ లాల్ నటన 
అమలా పాల్ 
కాన్సెప్ట్ 
 
డ్రా బ్యాక్స్
 
స్లో నెరేషన్ 
 కమర్షియల్ ఎలిమెంట్స్ లేకవడం 
 
నటీనటుల ప్రతిభ
 
సూపర్ స్టార్ మోహన్ లాల్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది , తనదైన మార్క్ నటనతో వేణు పాత్రకు ప్రాణం పోసాడు . అమలా పాల్ కు మంచి పాత్ర లభించింది . నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించడంతో సూపర్ స్టార్ తో పోటీపడింది . ఇక మిగిలిన పాత్రలలో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం
 
బ్లాక్ మనీ చిత్రానికి హైలెట్ గా ఛాయాగ్రహణం , రీ రికార్డింగ్ నిలిచాయి . రితీష్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయ్యింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకులు జోషి విషయానికి వస్తే మలయాళ చిత్ర రంగంలో అగ్రశ్రేణి దర్శకులు గా రాణించిన విశేష అనుభవం అతడి సొంతం . కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జోషి ఇప్పటి దర్శకులతో సైతం పోటీ పడుతున్నాడు . మీడియా రంగంలో వచ్చిన మార్పులు , దాన్ని అడ్డుపెట్టుకొని సాగే బ్లాక్ మెయిల్ ని బాగా చూపించాడు జోషి . అయితే ఎడిటింగ్ పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది . 
 
ఓవరాల్ గా
 
జనతా గ్యారేజ్ , మనమంతా , మన్యం పులి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహన్ లాల్ తాజాగా బ్లాక్ మనీ నేపథ్యంలో చేసిన ఈ సినిమా తో కూడా ప్రేక్షకులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది . 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD