డాక్టర్ చక్రవర్తి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

డాక్టర్ చక్రవర్తి రివ్యూ

Murali R | Published:July 15, 2017, 12:00 AM IST

నటీనటులు   : రిచర్డ్ రిషి , సోనియా మన్ , లీనా కుమార్ తదితరులు 
సంగీతం       : విజయ్ కూరాకుల 
నిర్మాతలు    : శేఖర్ సూరి , వెంకటేశ్వర్లు 
దర్శకత్వం   : శేఖర్ సూరి 
రేటింగ్       : 2. 75/ 5
రిలీజ్ డేట్   : 14 జూలై 2017


 

Editor Review
ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంతో సక్సెస్ అందుకున్న శేఖర్ సూరి తాజాగా థ్రిల్లర్ మూవీ ని రూపొందించాడు . రిచర్డ్ రిషి , సోనియా మన్ జంటగా తెరకెక్కిన ఈ డాక్టర్ చక్రవర్తి ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
సొసైటీ లో మంచి పేరు ప్రతిష్టలున్న డాక్టర్ చక్రవర్తి తన భార్య  వందన కూతురు సోనియా కొడుకు రాహుల్ తో కలిసి ఆనందంగా గడుపుతుంటాడు .  అయితే ఆసుపత్రి ని మరింతగా డెవలప్ చేయడానికి ధాత్రిక్ అనే మాఫియా డాన్  దగ్గర 50 కోట్ల రూపాయలను తీసుకుంటాడు , సకాలంలో ఆ డబ్బు ని ధాత్రిక్ కు ఇవ్వడు దాంతో అతడు డాక్టర్ చక్రవర్తి తో సహా అతడి కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తాడు .  అతడు చంపకముందే మనమే ఆత్మహత్య చేసుకుందామని ఫామ్ హౌజ్ కు వెళతారు . అయితే అక్కడ అనూహ్యంగా సోనియా చావడానికి నిరాకరిస్తుంది దాంతో డాక్టర్ చక్రవర్తి ఏం చేసాడు ? ఫామ్ హౌజ్ కు వెళ్లిన డాక్టర్ చక్రవర్తి కుటుంబం చనిపోయిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
నటీనటుల ప్రతిభ : 
 
సోనియా మన్ గ్లామర్ తో ఆకట్టుకోవడమే కాకుండా తన నటనతో కూడా అలరించింది , రిచర్డ్ రిషి కి కూడా మంచి పాత్ర లభించింది . తెలుగువాళ్ళ ముందుకు  మళ్ళీ చాలారోజుల తర్వాత  వచ్చాడు రిషి . గిరీష్ సహదేవ్ , లీనా అభిషేక్ తమ పాత్రలకు న్యాయం చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
థ్రిల్లర్ కథాంశంతో శేఖర్ సూరి రాసుకున్న కథ , కథనం బాగానే ఉంది కొన్ని సన్నివేశాలు బాగా డీల్ చేసాడు అయితే ఇంకాస్త గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే బాగుండేది . చివరి సీన్ వరకు సస్పెన్స్ మెయింటేన్ చేసిన విధానం బాగానే ఉంది . ఇంటర్వెల్ బ్లాక్ ని అలాగే క్లైమాక్స్ ని బాగా హ్యాండిల్ చేసాడు . నిర్మాణ విలువలు ఫరవాలేదు , ఛాయాగ్రహణం సినిమా మూడ్ కి తగ్గట్లుగా ఉంది . విజయ్ కూరాకుల నేపథ్య సంగీతం సినిమాకి హెల్ప్ అయ్యింది . 
 
ఓవరాల్ గా : థ్రిల్లర్ అంశాలు కోరుకునే ప్రేక్షకులకు బెస్ట్ ఛాయిస్.


Comments

LATEST GALLERY


MCA 3 Days To Go Posters


Sneha Ullal Latest Still


Dil Raju Birthday Press Meet Photos


MCA Movie Posters


Chalo Movie Stills


MCA Pre Release Event Photos


MCA Movie Posters


Sana Makbul Latest Stills


Suriya Gang Movie First Look


2 Countries Movie Audio Launch


Sony Charishta Latest Photos


Deeksha Panth New Stills


Victory Venkatesh.Latest Stills


Juliat Lover of Idiot Press Meet


Agnyathavasi Movie Poster

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD