ఫిదా రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ఫిదా రివ్యూ

Murali R | Published:July 21, 2017, 12:00 AM IST

నటీనటులు    : వరుణ్ తేజ్ , సాయి పల్లవి తదితరులు 
సంగీతం        : శక్తి కాంత్ 
నిర్మాత        : దిల్ రాజు 
దర్శకత్వం     : శేఖర్ కమ్ముల 
రేటింగ్         : 3/ 5
రిలీజ్ డేట్     : 21 జూలై 2017


 

Editor Review
వరుణ్ తేజ్ తో పాటు శేఖర్ కమ్ముల కూడా చాలాకాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు . సరిగ్గా అదే సమయంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మించిన చిత్రం ఫిదా . ఈరోజు రిలీజ్ అయిన ఫిదా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
అమెరికాలో స్థిరపడిన కుటుంబానికి చెందినవాడు డాక్టర్ వరుణ్ ( వరుణ్ తేజ్ ) . తన అన్న పెళ్లి కోసం అమెరికా నుండి బాన్స్ వాడ కు వస్తాడు . అక్కడ అన్న కు కాబోయే భార్య చెల్లెలు భానుమతి ( సాయి పల్లవి )ని ప్రేమిస్తాడు వరుణ్ . భానుమతి కూడా వరుణ్ ని ఇష్టపడుతుంది అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో వరుణ్ అమెరికా వెళ్ళిపోతాడు . అయితే భానుమతి ని మర్చిపోలేక తన ప్రేమని వ్యక్తం చేస్తాడు కానీ భానుమతి వరుణ్ ప్రేమని నిరాకరిస్తుంది . భానుమతి వరుణ్ ని ప్రేమించినప్పటికీ ఎందుకు నిరాకరించింది ? చివరకు ఆ ఇద్దరు ఒకటి అయ్యారా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
వరుణ్ తేజ్ 
సాయి పల్లవి 
ఫస్టాఫ్ 
సంగీతం 
కామెడీ 
 
డ్రా బ్యాక్స్ : 
 
క్లైమాక్స్ 
సినిమా నిడివి 
సెకండాఫ్ లో కొన్ని సీన్స్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి తనదైన నటనతో చెరగని ముద్ర వేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లుగా ప్రేక్షకులను మాత్రమే కాదు యావత్ సినిమా రంగాన్ని ఫిదా చేసింది సాయి పల్లవి . తెలంగాణ బాష నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం మరో మచ్చుతునక . అయితే కొన్ని సన్నివేశాల్లో కాస్త ఓవర్ గా కూడా చేసింది . ఇక అమెరికా అబ్బాయి గా వరుణ్ తేజ్ బాగా సెట్ అయ్యాడు . సాయి చంద్ చాలాకాలం తర్వాత ఈ సినిమాలో నటించాడు . అతడి క్యారెక్టర్ కూడా బాగుంది . 
 
సాంకేతిక వర్గం : 
 
దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి , శక్తికాంత్ సంగీతం ఈ సినిమాకు మరింత ఆకర్షణగా నిలిచింది . విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ తో సినిమా మరింత అందంగా ఉంది . విజువల్స్ బాగున్నాయి ఇక శేఖర్ కమ్ముల విషయానికి వస్తే ...... లవ్ స్టోరీ నేపథ్యంలో కథ , కథనాన్ని ఎంచుకొని అదే స్థాయిలో రక్తికట్టించారు దర్శకులు . డైలాగ్స్ కూడా ఆకట్టుకున్నాయి . ఎటువంటి హడావుడి లేకుండా సాఫిగా సాగిపోయేలా శేఖర్ కమ్ముల తన మార్క్ చూపించారు . చాలారోజుల తర్వాత ప్రేక్షకులను ఫిదా అయ్యేలా చేసాడు శేఖర్ కమ్ముల , అయితే సినిమా నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది . 
 
ఓవరాల్ గా : 
 
ప్రేక్షకులు ఫిదా


Comments

LATEST GALLERY


Raja The Great Movie Success Meet


Tejaswini Madivada New photo Shoot


Mahesh Babu & his family at his sister Manjula's Daughter Half Saree Function


Celebs at Shilpa Shetty's Diwali Party


Lavanya Tripathi New Stills


Neha Ratnakar Latest Photos


Lalijo Lalijo Movie Stills


Veena Vemula New Gallery


Nazia Khan Latest Stills


Angel Movie Trailer Launch


Hebha Patel New Photos


Mahanubhavudu Movie 4th Week Posters


Jai Lava Kusa 5th Week Posters


Karthi Khakee Movie Walls


Raja The Great Success Celebrations Photos

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD