Home రివ్యూస్ హైపర్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

హైపర్ రివ్యూ



Friday September 30th 2016

Hyper Review

Rating:

2.75/5

Direction:

Santhosh Srinivas

Producer:

14 Reels

Star Cast :

Ram
Rashi Khanna
Satya Raj & Others

Music :

Jibran

Release date:

30th September 2016

Genre:

Drama film/Romance

Censor:

U/A


కందిరీగ వంటి సూపర్ హిట్ తర్వాత రామ్ - సంతోష్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా హైపర్ కాబట్టి ఖచ్చితంగా ఆ హైప్ ఈ హైపర్ కి వచ్చింది . 14 రీల్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా లేదా అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 

Hyper (Prathi Intlo Okaduntaadu) Theatrical Trailer - Ram, Raashi Khanna



 

Editor Review
కథ :  
నిజాయితీకి మారు పేరైన ప్రభుత్వ ఉద్యోగి  నారాయణ మూర్తి  ( సత్యరాజ్ ) కొడుకు సూర్య ( రామ్ ) . సూర్య కు తండ్రి అంటే విపరీతమైన ప్రేమ ,ఆ అతి  ప్రేమతో తండ్రిని  ఇబ్బంది కూడా పెడుతుంటాడు అయితే తండ్రి రిటైర్ అయ్యే సమయానికి రాజప్ప (రావు రమేష్ ) అనే మినిస్టర్ కట్టాలనుకున్న కమర్షియల్  కాంప్లెక్స్ కు అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తాడు దాంతో మినిస్టర్ నారాయణమూర్తి ని టార్గెట్ చేస్తాడు . తండ్రికి కష్టం వచ్చిన విషయాన్నీ తెలుసుకొని మినిస్టర్ పై ఎలా ఎదురు తిరిగాడు ? చివరకు తండ్రి ని గెలిపించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
రామ్ 
ఛాయాగ్రహణం 
ఫస్టాఫ్ 
స్క్రీన్ ప్లే 
ఎంటర్ టైన్మెంట్ 
 
డ్రా బ్యాక్స్ : 
కథ 
సంగీతం 
లవ్ ట్రాక్ 
 
నటీనటుల ప్రతిభ : 
హైపర్ గా రామ్ ఎనర్జీ సూర్య పాత్రని మరో మెట్టులో నిలబెట్టింది . వినోదంలో కానీ యాక్షన్ లో కానీ డ్యాన్స్ లో కానీ ఎక్కడా జోష్ తగ్గకుండా తన ఎనర్జీ లెవల్స్ ని చూపించాడు రామ్ . రాశి ఖన్నా పాత్ర అంతంత మాత్రమే అయినప్పటికీ అందాలను ఆరబోసి ప్రేక్షకులకు విందు ని అందించింది . విలన్ గా రావు రమేష్ మరోసారి సత్తా చాటాడు . రాబోయే రోజుల్లో తెలుగు తెరకు మరో రావు గోపాలరావు ఇతడే అని అనిపించాడు , ఇప్పటికే పలు చిత్రాల్లో పలు పాత్రల్లో తనదైన ముద్ర వేసినప్పటికీ దీని తర్వాత టాప్ విలన్ రేంజ్ లోకి వెళ్ళడం ఖాయం . ఇక మిగిలిన పాత్రల్లో సత్యరాజ్ , మురళి శర్మ తదితరులంతా తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
సమీర్ రెడ్డి అందించిన ఛాయాగ్రహణం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచింది , జిబ్రాన్ సంగీతం ఫరవాలేదు అయితే మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అంత గొప్పగా ఏమి లేదు ఓకే . 14 రీల్స్ నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి ఇక దర్శకులు సంతోష్ శ్రీనివాస్ విషయానికి వస్తే హీరో క్యారెక్టర్ ని మలిచిన తీరు చాలా బాగుంది అయితే సాధారణ కథ ఎంచుకొని దానికి స్క్రీన్ ప్లే మాయాజాలం చేసి మెప్పించాడు . ఫస్టాఫ్ ని వినోద భరితంగా తీర్చిదిద్దిన సంతోష్ సెకండాఫ్ కు వచ్చేసరికి తేలిపోయాడు . 
 
ఓవరాల్ గా : 
తండ్రి అంటే పడిచచ్చే కొడుకు అన్న కథతో వచ్చిన ఈ సినిమా హ్యూమన్ ఎమోషన్స్ ని బాగానే క్యారీ చేసింది , యూత్ కి మాస్ కి కావలసిన అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టేలాగే ఉంది అయితే కొత్తదనం కోరుకునే వాళ్ళకు మాత్రం పెద్దగా నచ్చకపోవచ్చు . 
Comments

LATEST GALLERY


Dhruva Pre Release Function 2


Druva Pre Release Function


Rakul Preet Singh News Stills 2


Singam3 Trailer Launch


Rakul Preet Singh News Stills


Kadhambari Movie Audio Launch


Pragya New Photos


Vangaveeti Audio Launch


Arundhathi Nayar Latest Stills


Eesha News Stills


Ashwini News Stills


Nandita Swetha


PV Sindhu Watching Ekkadiki Pothavu Chinnavada Movie


Remo Movie Success Meet


Keethi Suresh News Stills

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..