ఇదేం దెయ్యం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ఇదేం దెయ్యం రివ్యూ

Murali R | Published:August 4, 2017, 12:00 AM IST

నటీనటులు    : మాగంటి శ్రీనాధ్ , రచ్చరవి , కిర్రాక్ ఆర్పీ , సాక్షి కక్కర్ ,రచన , రుచి పాండే

సంగీతం        : బాలు స్వామి

నిర్మాత        : సరిత

దర్శకత్వం    : రవివర్మ

రేటింగ్         : 3/ 5

రిలీజ్ డేట్     : 4 ఆగస్టు 2017


 

Editor Review
జబర్దస్త్ ప్రోగ్రాం తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రచ్చ రవి , కిర్రాక్ ఆర్పీ లతో పాటు శ్రీనాధ్ హీరోలుగా సాక్షి కక్కర్ , రచన స్మిత్ , రుచి పాండే హీరోయిన్ లుగా రవివర్మ దర్శకత్వంలో సరిత నిర్మించిన చిత్రం '' ఇదేం దెయ్యం '' . హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ దెయ్యం చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
పెద్దలు చూపించిన సంబంధాలు చేసుకోకుండా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటారు ముగ్గురు యువకులు . అయితే వాళ్లకు బుద్ది చెప్పడానికి ఓ బంగాళా కు పంపిస్తాడు మాంత్రికుడు . అదే బంగళాలో అప్పటికే ముగ్గురు అందమైన అమ్మాయిలు ఉంటారు . ఈ ఆరుగురు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటారు . కానీ ప్రేమని వ్యక్తం చేయరు . తమ ప్రేమని వ్యక్తం చేయాలనుకునే సమయానికి ఆ  ముగ్గురు అమ్మాయిలకు దెయ్యం పట్టిందని తెలుసుకొని ఆ బంగాళా నుండి పారిపోవాలని అనుకుంటారు . కానీ మంత్రశక్తి వల్ల ఆ బంగాళా నుండి ముగ్గరు యువకులు పారిపోలేరు. చివరకు ఆ బంగాళా నుండి ఆ ముగ్గురు యువకులు బయట పడ్డారా ? లేదా ? ముగ్గురు అమ్మాయిలకు పట్టిన దెయ్యం వదిలిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
నటీనటుల ప్రతిభ : 
 
ముగ్గురు యువకులు గా శ్రీనాద్ , రచ్చ రవి , కిర్రాక్ ఆర్పీ  బాగానే నటించారు . రచ్చ రవి , ఆర్పీ లు నవ్వించడంలో రాటు దేలారు కాబట్టి ఆ పాత్రలలో  మరింతగా రాణించారు . ఇక ముగ్గురు అమ్మాయిలు సాక్షి కక్కర్ , రచన స్మిత్ , రుచి పాండే లు పోటీ పడి అందాలను ఆరబోశారు . భయపెట్టడం కంటే అందాలను తెర నిండా పరిచి కుర్రాళ్లు ఫిదా అయ్యేలా చేసారు . అలాగే మిగిలిన పాత్రల్లో జీవా , గౌతమ్ రాజు , జబర్దస్త్ అప్పారావు లు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
బాలు స్వామి అందించిన పాటలు బాగున్నాయి , నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది . కెపి ఛాయాగ్రహణం ఫరవాలేదు . నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి . ఇక దర్శకుడు రవివర్మ విషయానికి వస్తే హర్రర్ నేపథ్యానికి హాస్యం ని జోడించి చేయాలనే ప్రయత్నం ఫరవాలేదని పిస్తుంది . కామెడీ కొన్ని చోట్ల బాగానే పేలింది . కాస్త తక్కువ భయపెట్టినప్పటికీ మొదటి ప్రయత్నం లోనే మంచి అటెంప్ట్ చేసాడు రవివర్మ . 
 
ఓవరాల్ గా : 
 
హర్రర్ సినిమాలు , హీరోయిన్ ల అందాలను కోరుకునే వాళ్లకు ఇదేం దెయ్యం మంచి ఛాయిస్


Comments

LATEST GALLERY


Manjusha Latest Stills


Nani Mca Movie First Look


Priyanka Latest Stills


Sakshyam Movie Motion Poster Launch


Pooja Hegde New Photos


Garuda Vega Movie Trailer Launch


Mahanati Movie Posters


Mehreen Kaur Latest Stills


Keerthi Suresh Birthday Photos


Krishna Rao Supermarket Movie Opening


Elsa Ghosh New Photos


Raju Gari Gadhi 2 Movie Success Meet


Seerat Kapoor Latest Stills


Samantha New Stills


Raja The Great Movie New Walls

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD