Home రివ్యూస్ ఇంకొక్కడు రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ఇంకొక్కడు రివ్యూThursday September 08th 2016

Inkokkadu Movie Review

Rating:

2.5/5

Direction:

Anand Shankar

Producer:

Shibu Thameens

Written by:

Anand Shankar

Star Cast :

Vikram
Nayantara
Nithya Menen

Music :

Harris Jayaraj

Production
company:

Thameens Films

Release date:

8th September 2016

Genre:

Fantasy/Mystery

Censor:

U/A


ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హీరో విక్రం గతకొంత కాలంగా హిట్ కోసం పరితపిస్తున్నాడు . తాజాగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో నటించిన ఇరు ముగన్ చిత్రాన్ని తెలుగులో ఇంకొక్కడు గా రిలీజ్ చేసారు . నయనతార ,నిత్యా మీనన్ లు నటించిన ఈ చిత్రంతో విక్రం సక్సెస్ అందుకున్నాడా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .

Inkokkadu Movie Official Teaser 

Editor Review
కథ : 
మలేషియా లోని ఇండియన్ రాయబార కార్యాలయం పై దాడి జరగడంతో దర్యాప్తులో భాగంగా దాన్ని చేధించాలంటే సస్పెన్షన్ లో ఉన్న రా ఆఫీసర్ అఖిల్ (విక్రం ) వల్లే అవుతుందని అతడికి ఆ బాధ్యతలు అప్పగిస్తారు . లవ్ ( గే రూపంలో ఉన్న విక్రం ) వల్లే తన భార్య మీరా ( నయనతార ) చనిపోయిందని వాళ్ళ అంతు చూడటానికి మలేషియా వెళతాడు అఖిల్ . మలేషియా వెళ్ళిన అఖిల్ అక్కడ లవ్ ని ఎదుర్కొనే క్రమంలో తన భార్య చూసి షాక్ అవుతాడు . ఇంతకీ అఖిల్ భార్య బ్రతికే ఉందా ? లవ్ ఎవరు ? స్పీడ్ డ్రగ్ వల్ల ఎటువంటి రాబోతోంది ? చివరకు లవ్ ని అంతం చేసాడా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ :  
విక్రం  
రీ రికార్డింగ్ 
నయనతార గ్లామర్ 
నిత్యా గ్లామర్ 
 
డ్రా బ్యాక్స్ : 
స్క్రీన్ ప్లే 
స్లో నెరేషన్ 
పాటలు 
 
నటీనటుల పెర్ఫార్మెన్స్ : 
రా ఆఫీసర్ అఖిల్ గా గే పాత్రలో లవ్ గా రెండు విభిన్న మైన పాత్రలను పోషించి మెప్పించాడు విక్రం . నయనతార గ్లామర్ మరో హైలెట్ ఈ చిత్రానికి . నటన తో పాటు అందాలను తెరమీద పరిచి కంటికింపు ని కలిగించింది అలాగే నిత్యా మీనన్ పాత్ర కొద్దోసేపే అయినప్పటికీ ఫరవాలేదని పించింది . ఇక మిగిలిన పాత్రధారులు తమపరిధి మేరకు బాగానే చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
దర్శకులు ఆనంద్ శంకర్ కొత్త పాయింట్ ని ఎంచుకొని సైన్స్ పిక్షన్ అంటూ హడావుడి చేయబోయాడు కానీ అనుకున్న స్థాయిలో రాణించలేక పోయాడు దాంతో కొంతవరకు ఆకట్టుకున్నాడు కానీ పూర్తిస్థాయిలో మాత్రం ఆకట్టుకోలేక పోయాడు . హరీష్ జై రాజ్ పాటలు అంతగా ఆకట్టుకునేలా లేవు కానీ రీ రికార్డింగ్ తో ఆకట్టుకున్నాడు . ఆర్డీ రాజశేఖర్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత అందాన్ని ఇచ్చింది . నిర్మాణ విలువలు బాగున్నాయి . 
 
ఓవరాల్ గా : 
సరికొత్త అంశం తో తెరకెక్కిన ఇంకొక్కడు మాస్ మసాలాల కోసం కాకుండా కొత్త తరహా చిత్రం చూద్దామని కోరుకునే వాళ్ళకు మంచి ఛాయిస్ అయితే  ప్రేక్షకులను పూర్తిస్థాయిలో ఆకట్టుకునేలా మాత్రం ఈ ఇంకొక్కడు రూపొందలేదు . 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD