Home రివ్యూస్ Janatha Garage Movie Review - జనతా గ్యారేజ్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

Janatha Garage Movie Review - జనతా గ్యారేజ్ రివ్యూ



Thursday September 01st 2016

Janatha Garage Movie Review

Rating:

2.75/5

Direction:

Koratala Siva

Producer:

Naveen Yerneni
Y. Ravi Shankar
C. V. Mohan

Written by:

Koratala Siva

Star Cast :

N. T. Rama Rao Jr.
Mohanlal
Samantha Ruth Prabhu
Nithya Menen
Unni Mukundan

Music :

Devi Sri Prasad

Production company: 

Mythri Movie Makers

Distributed by:

Eros International

Release date:

1st September 2016

Genre:

Drama film/Action

Censor:

U/A


వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న ఎన్టీఆర్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తో కలిసి నటించిన చిత్రం జనతా గ్యారేజ్ . ఈ చిత్రానికి దర్శకులు కొరటాల శివ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి . ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 

Janatha Garage Trailer

 



 

Editor Review
( Janatha Garage Movie )కథ :  
జనతా గ్యారేజ్ ని పెట్టుకొని పాడైపోయిన వాహనాలను బాగు చేయడమే కాకుండా ప్రజలను పట్టి పీడిస్తున్న వాళ్ళని కూడా రిపేర్ చేస్తుంటాడు సత్యం ( మోహన్ లాల్ ) . ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ సహాయపడే సత్యం అంటే గిట్టని బిజినెస్ టైకూన్ ముఖేష్ ( సచిన్ ఖేడ్కర్ ) తన బిజినెస్ కు అడ్డు వస్తున్నాడని సత్యం ని చంపాలను కుంటాడు అయితే ముఖేష్ ప్లాన్ సవ్యంగా సాగకపోవడంతో భారీ యాక్సిడెంట్ నుండి ప్రాణాలతో బయట పడతాడు సత్యం . అదే సమయంలో ముంబై లో ఉంటూ  ప్రకృతి అంటే పడిచచ్చే ఆనంద్ (ఎన్టీఆర్ ) హైదరాబాద్ కు వస్తాడు . అక్కడ మనుషుల కోసం పరితపించే సత్యం ని కలుస్తాడు . ప్రక్రుతి కోసం పోరాడే ఆనంద్ ప్రజల కోసం పోరాడే సత్యం తో కలిసి ఏం చేసాడు ? అసలు ఆనంద్ కు జనతా గ్యారేజ్ కు సంబంధం ఏంటి ? సత్యం కు ఆనంద్ ఏమౌతాడు ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ :  
ఎన్టీఆర్ 
మోహన్ లాల్ నటన 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం 
తిరు ఛాయాగ్రహణం 
 
డ్రా బ్యాక్స్ : 
స్క్రీన్ ప్లే 
ఎంటర్ టైన్మెంట్ 
సినిమా నిడివి 

నటీనటుల పెర్ఫార్మెన్స్ :  
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సత్యం పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి భేష్ అనిపించారు . బలమైన పాత్రని అంతే బలమైన నటుడు పోషిస్తే దానికుండే స్టేచర్ ఏంటో మోహన్ లాల్ పాత్ర చూస్తే తెలుస్తుంది . ఎన్టీఆర్ కూడా తన పాత్రని అంతే సమర్దవతంగా పోషించాడు . ఎన్టీఆర్ మార్క్ డైలాగ్స్ అంతగా లేకున్నా మరో కోణం లో కనిపించాడు ఎన్టీఆర్ . హీరోయిన్ లు సమంత , నిత్యా మీనన్ ల పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేదు ఉన్నంతలో ఇద్దరు కూడా బాగానే చేసారు కానీ అసలు వాళ్ళు ఉన్నారా అని అనిపించడం కూడా ఖాయం ఒక దశలో . కాజల్ అగర్వాల్ పాట ఒక రకంగా రిలీఫ్ అనే చెప్పాలి ఎందుకంటే సీరియస్ గా సాగిపోతున్న సమయంలో ఓ నిట్టూర్పు కోసం అయితే మేకర్స్ చెప్పినట్లుగా అసలు ఈ పాటే అవసరం లేదు సినిమాలో . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం :  
తిరు అందించిన సినిమాటో గ్రఫీ ఈ సినిమాకు హైలెట్ అనే చెప్పాలి . ప్రకృతి ని ఎంత అందంగా చూపించాడో సినిమా కి పెట్టిన ఖర్చు ని కూడా అదే స్థాయిలో చూపించి విజువల్ ఫీస్ట్ అందించాడు అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా మరో హైలెట్ ఈ జనతా గ్యారేజ్ చిత్రానికి . నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక దర్శకులు కొరటాల శివ విషయానికి వస్తే రెండు బలమైన పాత్రలను అలాగే ప్రకృతి ని కాపాడుకుందాం , మనుషులను కాపాడుకుందాం అనే మంచి అంశాన్ని కథా వస్తువుగా తీసుకున్నాడు కానీ అంతే బలంగా చెప్పడంలో మాత్రం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేక పోయాడు . 
 
ఓవరాల్ గా :  
అసలే ఎన్టీఆర్ మాస్ హీరో కావడం, అతడికి తోడూ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ జత కుదరడం కొరటాల శివ దర్శకుడు కావడంతో జనతా గ్యారేజ్ చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి . అయితే స్కై రేంజ్ హిట్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశించడంలో తప్పులేదు కానీ ఆ రేంజ్ హిట్ అంటే మాత్రం డౌటే ! అయితే మొత్తానికి ఎన్టీఆర్ హిట్ కొట్టాడు ఈ జనతా గ్యారేజ్ తో అయితే ఇండస్ట్రీ హిట్ మాత్రం కొట్టలేక పోయాడు . అది కన్ఫర్మ్ . 
Comments

LATEST GALLERY


Nakshatram Movie Walls


Ruchi Panday New Gallery


Rachana Smith Latest Stills


Idem Deyyam Audio Launch


Sakshi Kakkar New Gallery


VIP2 Movie Press Meet


Kajol Latest Photos


LIE New Wall


Suvarnasundari New Poster


Vaadu Osthadu Movie Stills


Avanthika Mishra Latest Stills


Nakshatram Movie Walls


Vaishakam Movie Succesmeet


Sarovaram Movie Teaser Launch


Poojitha Ponnada New Stills

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD