జ్యో అచ్యుతానంద రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

జ్యో అచ్యుతానంద రివ్యూ

Murali R | Published:September 9, 2016, 12:00 AM IST

Jyo Achyutananda Review

Rating:

3/5

Direction:

Srinivas Avasarala

Producer:

Sai Korrapati

Star Cast :

Nara Rohit
Naga Shourya
Regina Cassandra

Music :

Kalyan Koduri

Production
company:

Varahi Chalana Chitram

Release date:

9th September 2016

Genre:

Drama film/Romance

Censor:

U 

 

నారా రోహిత్ , నాగ శౌర్య , రెజీనా ల కాంబినేషన్ లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం '' జ్యో అచ్యుతానంద ''. ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్ళాల్సిందే . 

Jyo Achyutananda Theatrical Trailer  

Editor Review
కథ : 
మద్య తరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నాదమ్ములు అచ్యుత్ ( నారా రోహిత్ ) ఆనంద్ (నాగ శౌర్య ) . వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగుతుంది జ్యోత్స్న ( రెజీనా ) , అందమైన అమ్మాయి కావడంతో ఆమెతో స్నేహంగా ఉంటూ ప్రేమిస్తుంటారు ఇద్దరు అన్నాదమ్ములు . అయితే వాళ్ళ ప్రేమ ని తిరస్కరించి నేను ప్రేమలో ఉన్నానని చెప్పి వెళ్ళిపోతుంది  . కట్ చేస్తే కొద్ది కాలం తర్వాత జ్యోత్స్న మళ్ళీ ఆ ఇద్దరి జీవితంలోకి వస్తుంది . ఇంతకీ జ్యోత్స్న ప్రేమించింది ఎవరిని ? ఆమె మళ్ళీ ఈ ఇద్దరు అన్నాదమ్ముల జీవితాల్లోకి ఎందుకు వచ్చింది ? చివరకు ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
కథ 
కథనం 
నారా రోహిత్ 
నాగ శౌర్య 
రెజీనా 
ఎంటర్ టైన్మెంట్ 
 
డ్రా బ్యాక్స్ : 
సెకండాఫ్ 
రివెంజ్ ఎపిసోడ్ 
 
నటీనటుల ప్రతిభ : 
నారా రోహిత్ అచ్యుత్ పాత్రలో మెప్పించాడు అయితే లుక్స్ విషయంలో ఇంకా మెరుగవ్వాలి. నాగ శౌర్య కూడా ఆనంద్ పాత్రలో తనదైన ముద్ర వేసాడు . రెజీనా పాత్ర కూడా బాగుంది , అంతే సమర్దవంతంగా పోషించింది . 
 
సాంకేతిక వర్గం :  
కళ్యాణ్ రమణ అందించిన పాటలు బాగున్నాయి ,అలాగే రీ రికార్డింగ్ కూడా మరింత ప్లస్ అయ్యింది . వెంకట్ దిలీప్ అందించిన ఛాయాగ్రహణం కూడా మరింతగా బాగుంది , నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక దర్శకులు అవసరాల శ్రీనివాస్ విషయానికి వస్తే ................ జ్యో అచ్యుతానంద చిత్రాన్ని జనరంజకంగా మలచడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అవసరాల . ఎంచుకున్న కథ సింపుల్ గా ఉన్నప్పటికీ మెప్పించే స్క్రీన్ ప్లే తో బాగానే ప్లే చేసాడు అవసరాల . సెకండాఫ్ లో వచ్చే ఓ ఎపిసోడ్ మినహా అవసరాల బాగానే రాణించాడు . 
 
ఓవరాల్ గా : 
కథ సామాన్యమైనదే అయినప్పటికీ దానికి పకడ్బందీ స్క్రీన్ ప్లే జోడించి మంచి మేజిక్ చేసాడు అవసరాల . వినోదం తో పాటు సెంటిమెంట్ ని జోడించి తెరకెక్కించిన జ్యో అచ్యుతానంద ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇవ్వడం ఖాయం . 


Comments

LATEST GALLERY


Namitha Wedding Photos


PSPK25 Pre-Look Poster


A glimpse from NKR15 Kalyan Ram and Tamannah Bhatia


Oxygen Movie Stills


Vishnu Manchu Voter First Look


Sharwanand New Movie Opening Stills


Hey Pillagada Movie Posters


Lakshmi Manchu Latest Gallery


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD