కేశవ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

కేశవ రివ్యూ

Murali R | Published:May 19, 2017, 12:00 AM IST

నటీనటులు : నిఖిల్ , రీతూ వర్మ , అజయ్ తదితరులు 
సంగీతం : ఎం ఆర్ సన్నీ 
 నిర్మాత : అభిషేక్ నామా 
దర్శకత్వం : సుధీర్ వర్మ 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 19 మే 2017


 

Editor Review
విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ కెరీర్ లో ముందుకు దూసుకుపోతున్న హీరో నిఖిల్ . స్వామి రారా వంటి హిట్ చిత్రాన్ని అందించిన సుధీర్ వర్మ దర్శకత్వంలో మరోసారి '' కేశవ '' గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్ . ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ
 
అందరికీ గుండె ఎడమ వైపున ఉంటే కేశవ(నిఖిల్ ) కు మాత్రం కుడి వైపున ఉంటుంది . దాంతో ఎక్కువ టెన్షన్ పడినా గుండె ఆగిపోతుంది దాంతో కూల్ గానే ఉంటూ పోలీసులను మాత్రం కిరాతకంగా చంపేస్తుంటాడు . వరుసగా పోలీసుల హత్యలు జరుగుతుండటం తో ఆ హత్యల కేసుని చేధించడానికి స్పెషల్ ఆఫీసర్ షర్మిల ( ఇషా కొప్పికర్ ) ని నియమిస్తారు . డిగ్రీ చదువుతున్న కేశవ పోలీసులను ఎందుకు చంపుతున్నాడు ? షర్మిల పోలీసుల హత్య లను ఆపగలిగిందా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
నిఖిల్ నటన 
స్క్రీన్ ప్లే 
రన్ టైం 
 
డ్రా బ్యాక్స్ : 
 
సెకండాఫ్ 
స్లో నేరేషన్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
నిఖిల్ కెరీర్ లో నిజంగానే డిఫరెంట్ సినిమా ఈ కేశవ . పైగా పెర్ఫర్మెన్స్ పరంగా కూడా చాలా సెటిల్డ్ గా చేసి ప్రేక్షకుల మెప్పు పొందాడు . 
 నిఖిల్ లుక్ పరంగా , కంటెంట్ పరంగా కూడా ఈ సినిమాకు సరిగ్గా సరిపోయింది . ఇషా కొప్పికర్ స్పెషల్ ఆఫీసర్ గా సరిగ్గా సరిపోయింది అయితే క్యారెక్టర్ పరంగా మరింత పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేది . రీతూ వర్మ అందంగా ఉంది , అలాగే అభినయం కూడా బాగుంది . ఇక మిగిలిన పాత్రల్లో వెన్నెల కిషోర్ , సత్య , ప్రియదర్శి నవ్వించి మెప్పించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
సుధీర్ వర్మ దర్శకుడిగా మరోసారి తన సత్తా చాటాడు . ఫస్టాఫ్ ని బాగా మెప్పించిన సుధీర్ సెకండాఫ్ కు వచ్చేసరికి కొంతవరకు తేలిపోయినప్పటికీ మళ్ళీ చివర్లో మెప్పించాడు . ఇంతకుముందు నిఖిల్ తో స్వామి రారా వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సుధీర్ వర్మ ఈ కేశవ ని కూడా మెరుగ్గానే తీర్చి దిద్దాడు . ఎం ఆర్ సన్నీ రీ రికార్డింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యింది అయితే పాటల పరంగా అంతగా గుర్తుండిపోయే ట్యూన్స్ మాత్రం ఇవ్వలేక పోయాడు . దివాకర్ ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకు మరో హైలెట్ . అభిషేక్ నిర్మాణ విలువలు బాగున్నాయి . 
 
ఓవరాల్ గా : 
 
రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన నిఖిల్ కేశవ సూపర్ హిట్ రేంజ్ కాకపోయినా హిట్ మాత్రం అనిపించుకుంది . నిఖిల్ విభిన్న నటన , వెన్నెల కిషోర్ , సత్య , ప్రియదర్శి ల కామెడీ వెరసి కేశవ సినిమాని హిట్ అయ్యేలా చేసాయి . 


Comments

LATEST GALLERY


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch


Chalo Movie Teaser Launch


Rashmika Mandanna New Photos


Nayantara Jai Simha Movie Posters


Hello Movie Stills


Rakul Preet Singh New Gallery


Kanam Movie Poster


WWW.Meenabazar Movie Pressmeet


Sreejitha Latest Stills


Allu Arjun Launches Buffalo Wild Wings Restaurant

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD