Home రివ్యూస్ మజ్ను రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

మజ్ను రివ్యూFriday September 23rd 2016

Majnu Review

Rating:

2.75/5

Direction:

Virinchi Varma

Producer:

Geetha Golla
P. Kiran

Star Cast :

Nani
Anu Emmanuel 
Priya Shri

Music :

Gopi Sunder

Production
company:

Anandi Art Creations
Keva Movies

Release date:

23 September 2016

Genre:

Drama film/Romance

Censor:

U/A

వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న నాని విరించి వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం ''మజ్ను ''. ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 
Nani's Majnu Theatrical Trailer  

Editor Review

కథ :  

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసే ఆదిత్య ( నాని ) సుమ (ప్రియశ్రీ ) ని చూసి లవ్ లో పడతాడు . ఆమె ప్రేమ పొందడానికి తను ఇంతకుముందు ప్రేమించిన అమ్మాయి గురించి చెబుతాడు అయితే సుమ ప్రేమ కోసం ఆరాట పడుతున్న సమయంలో తన పాత లవర్ గుర్తొచ్చి  ఇప్పటికి ఆమెనే ప్రేమిస్తున్నాని ఆమెని వెతుక్కుంటూ వెళ్ళాలని భావిస్తున్న తరుణంలో సుమ తో పాటు కిరణ్ ( అను ఇమ్మానుయెల్ ) ని చూసి షాక్ అవుతాడు ఆదిత్య . ఒకవైపు ఏమో తను ప్రేమించిన అమ్మాయి , మరోవైపు ఆదిత్య ని ప్రేమిస్తున్న అమ్మాయి ఆ ఇద్దరిలో ఎవరిని చివరకు దక్కించుకున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
నాని 
అను ఇమ్మానుయెల్ 
ఛాయాగ్రహణం 
ఫస్టాఫ్ 
వెన్నెల కిషోర్ 

డ్రా బ్యాక్స్ : 
సెకండాఫ్ 
రొటీన్ కథ 
 
నటీనటుల ప్రతిభ : 
నాని ఆదిత్య పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసాడు . ముఖ్యంగా ఫస్టాఫ్ లో నాని నటన చాలా సహజంగా ఉంది అలాగే ఆ ఆటిట్యూడ్ తో ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా చేసాడు . అను ఇమ్మానుయెల్ కూడా అందంగా ఉండటమే కాదు మరింత అందంగా నటించింది కూడా .  ప్రియ శ్రీ పాత్ర ఫరవాలేదు , వెన్నెల కిషోర్ , సత్య నవ్వులు పూయించారు . రాజ్ తరుణ్ స్పెషల్ అప్పియరెన్స్ అంత బాగోలేదు . 
 
సాంకేతిక వర్గం :  
మజ్ను చిత్రానికి జ్ఞాన శేఖర్ అందించిన ఫోటోగ్రఫీ హైలెట్ గా నిలిచింది . భీమవరం పరిసర ప్రాంతాలను అందంగా చూపించాడు . గోపి సుందర్ సంగీతం బాగుంది . ఇక దర్శకుడు విరించి వర్మ విషయానికి వస్తే ఫస్టాఫ్ ని అందంగా చూపించాడు ,అక్కడ బాగా సక్సెస్ అయ్యాడు కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి కొంత తడబడ్డాడు . 
 
ఓవరాల్ గా : 
సాధారణ కథ అయినప్పటికీ నాని ,అను ఇమ్మానుయెల్  ల నటన ,విరించి దర్శకత్వ ప్రతిభ , అందమైన ఛాయాగ్రహణం ,కథలో భాగంగా వచ్చే సంగీతం వెరసి మజ్ను చిత్రం  యూత్ ని ఆకట్టుకోవడం ఖాయం . అయితే బిసి కేంద్రాల్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి . మొత్తానికి అర్బన్ ఏరియాలో మజ్ను చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఖాయంగా కనిపిస్తోంది . 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD