Home రివ్యూస్ మామ్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

మామ్ రివ్యూFriday July 07th 2017

నటీనటులు    : శ్రీదేవి , నవాజుద్దీన్ సిద్దిఖీ , అక్షయఖన్నా ,సాజల్ అలీ 
సంగీతం        : ఏ ఆర్ రెహమాన్ 
దర్శకత్వం    : రవి ఉద్యవార్ 
రేటింగ్          : 3. 5/5
రిలీజ్ డేట్    : 7 జూలై 2017


 

Editor Review
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భరతమాత ఎదుర్కొంటున్న బర్ణింగ్ ప్రాబ్లెమ్ ని కథగా ఎంచుకొని శ్రీదేవి కీలక పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం '' మామ్ ''. అక్షయ ఖన్నా , నవాజుద్దీన్ సిద్దిఖీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
వాలెంటైన్స్ డే రోజున తన మిత్రులతో కలిసి ఓ ఫార్మ్ హౌజ్ కు వెళుతుంది ఆర్య ( సజల్ అలీ )అయితే ఆ ఫార్మ్ హౌజ్ నుండి ఆర్య  బయటకు వస్తున్న సమయంలో నలుగురు వ్యక్తులు ఆర్య ని కిడ్నాప్ చేసి కారులో అత్యంత దారుణంగా రేప్ చేస్తారు . రేప్ చేసిన తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో పడేస్తారు . ఆర్య సవతి తల్లి దేవకీ సబర్వాల్ ( శ్రీదేవి ) ఒక టీచర్ , తన కూతురు కి జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక పోతుంది అయితే దోషులు పోలీసులకు దొరికినప్పటికీ సెక్షన్ లలో ఉన్న లోపాల వల్ల నిర్దోషులుగా బయటకు వస్తారు దాంతో వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవడానికి మామ్ ఏం చేసింది ? ఆర్య ని రేప్ చేసింది ఎవరు ? తల్లి మనసుని ఆర్య అర్ధం చేసుకుందా ? ఇత్యాది విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
శ్రీదేవి నటన 
నవాజుద్దీన్ సిద్దిఖీ 
ఏ ఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం 
ఛాయాగ్రహణం 
దర్శకత్వం 
 
డ్రా బ్యాక్స్ : 
 
లేవు 
 
నటీనటుల ప్రతిభ : 
 
 తల్లి పాత్రలో శ్రీదేవి నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సాగింది , శ్రీదేవి నటన గురించి కొత్తగా చెప్పాల్సింది ఏముంది అయితే ఈ పాత్రలో మాత్రం ఒక్క దేవకీ సబర్వాల్ ని మాత్రమే గుర్తు చేయలేదు యావత్ భారతావని లో ఉన్న తల్లులందరికీ స్ఫూర్తి దాయకంగా నటించి మెప్పించింది . తల్లి హృదయం ఎలా ఉంటుందో , ఎంత దృడంగా ఉండాలో చాటి చెప్పింది . శ్రీదేవి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఎంత పొగిడినా తక్కువే ! అలాగే డిటెక్టివ్ పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ నటన మరో హైలెట్ ఈ సినిమాకు . అక్షయ ఖన్నా అలాగే సజల్ అలీ ,అభిమన్యు సింగ్ ఇలా మిగతా అందరు కూడా తమతమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు , మెప్పించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
బోనీ కపూర్ నిర్మాణ విలువలు బాగున్నాయి , ఇక ఏ ఆర్ రెహమాన్ సంగీతం విషయానికి వస్తే నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది . అనయ్ గోస్వామి ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది . గిరీష్ స్క్రీన్ ప్లే ,రవి ఉద్యవార్ దర్శకత్వ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే . మొదటి చిత్రమే అయినప్పటికీ రవి అద్భుతంగా రాణించాడు సూపర్ హిట్ కొట్టాడు . 
 
ఓవరాల్ గా : 
 
మామ్ ప్రతీ ఒక్కరు చూడాల్సిన సినిమా
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD