నక్షత్రం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

నక్షత్రం రివ్యూ

Murali R | Published:August 4, 2017, 12:00 AM IST

నటీనటులు    : సాయి ధరమ్ తేజ్ , సందీప్ కిషన్ , రెజీనా , ప్రగ్యా జైస్వాల్ 
రీ రికార్డింగ్     : మణిశర్మ 
నిర్మాతలు     : శ్రీనివాస్ , వేణుగోపాల్ , సజ్జు 
దర్శకత్వం     : కృష్ణవంశీ 
రేటింగ్         : 1/ 5
రిలీజ్ డేట్     : 4 ఆగస్టు 2017


 

Editor Review
కృష్ణవంశీ చాలారోజుల తర్వాత దర్శకత్వం వహించిన చిత్రం '' నక్షత్రం ''. సాయిధరమ్ తేజ్ , సందీప్ కిషన్ , రెజీనా , ప్రగ్యా , ప్రకాష్ రాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
ఎస్సై కావాలని ఆశపడే రామారావు ( సందీప్ కిషన్ ) అనుకోకుండా పోలీస్ కమీషనర్ కొడుకు రాహుల్ ( తనీష్ ) తో గొడవ పడతాడు దాంతో రామారావు పై కక్ష్య కట్టిన రాహుల్ అతడికి ఎస్సై ఉద్యోగం రాకుండా చేస్తాడు . పోలీస్ ఉద్యోగం రాకపోవడంతో చావాలని అనుకుంటాడు కానీ న్యాయాన్ని కాపాడటానికి ఉద్యోగం రాకపోయినప్పటికీ అలెగ్జా0డర్ గా  పోలీస్ అవతారం ఎత్తుతాడు . అసలు అలెగ్జా0డర్ ఎవరు ? రామారావు కి అతడికి సంబంధం ఏంటి ? చివరకు రామారావు కు పోలీస్ ఉద్యోగం వచ్చిందా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
సాయి ధరమ్ తేజ్ 
సందీప్ కిషన్ 
రెజీనా గ్లామర్ 
ప్రగ్యా జైస్వాల్ అందాలు 
 
డ్రా బ్యాక్స్ : 
 
సినిమా మొత్తం 
 
నటీనటుల ప్రతిభ : 
 
పాత్ర చిన్నదే అయినప్పటికీ తనదైన మార్క్ తో మెప్పించాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . సందీప్ కిషన్ కూడా తన పాత్ర కు ప్రాణం పెట్టి చేసాడు . నెగెటివ్ రోల్ లో తనీష్ మెప్పించాడు . ఇక ఇద్దరు అందమైన భామలు రెజీనా , ప్రగ్యా జైస్వాల్ లు పోటీ పడి అందాలను ఆరబోసి ప్రేక్షకులను మత్తులో ముంచెత్తారు . ప్రగ్యా యాక్షన్ తో కూడా మెప్పించింది . ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్ , బ్రహ్మాజీ , శివాజీరాజా లు తమతమ పాత్రల పరిధి మేరకు రాణించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
దర్శకులు కృష్ణవంశీ ఏ దశలో కూడా తన మార్క్ ని చూపించలేకపోయాడు . సరైన దశ దిశా లేని కథనం తో ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు . హీరోయిన్ లచేత అంగాంగ ప్రదర్శన చేయించిన ఆసక్తి కథ , కథనం పై పెట్టి ఉంటే బాగుండేది . పాటలకంటే నేపథ్య సంగీతం బాగుంది . మణిశర్మ నేపథ్య సంగీతం అందించాడు . నిర్మాణ విలువలు , ఛాయాగ్రహణం బాగున్నాయి . 
 
ఓవరాల్ గా : 
 
నక్షత్రం అని వెళ్లిన ప్రేక్షకులకు కళ్ళు బైర్లు కమ్మేలా చేసారు .


Comments

LATEST GALLERY


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch


Chalo Movie Teaser Launch


Rashmika Mandanna New Photos


Nayantara Jai Simha Movie Posters


Hello Movie Stills


Rakul Preet Singh New Gallery


Kanam Movie Poster


WWW.Meenabazar Movie Pressmeet


Sreejitha Latest Stills


Allu Arjun Launches Buffalo Wild Wings Restaurant

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD