నిన్ను కోరి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

నిన్ను కోరి రివ్యూ

Murali R | Published:July 7, 2017, 12:00 AM IST

నటీనటులు   : నాని , నివేదా థామస్ , ఆది పినిశెట్టి 
సంగీతం       : గోపిసుందర్ 
నిర్మాత       : డివివి దానయ్య 
దర్శకత్వం    : శివ నిర్వాణ 
రేటింగ్        : 2. 5/ 5
రిలీజ్ డేట్    : 7 జూలై 2017


 

Editor Review
వరుస విజయాలతో మంచి జోరు మీదున్న నాని మరోసారి తనకు అచ్చి వచ్చిన భామ నివేదా థామస్ తో కలిసి నటించిన చిత్రం '' నిన్ను కోరి '' కొత్త దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
వైజాగ్ లో పి హెచ్ డి చేసే ఉమా మహేశ్వర్ రావు ( నాని ) పల్లవి ( నివేదా థామస్ ) ని ప్రేమిస్తాడు . పల్లవి కూడా ఉమా ని ప్రేమిస్తుంది అయితే ఉమా మహేశ్వర్ రావు కి ఉద్యోగం లేకపోవడంతో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందామని ఢిల్లీ వెళ్తాడు , అదే సమయంలో పల్లవి తండ్రి అమెరికా సంబంధం అరుణ్ (ఆది పినిశెట్టి ) ని చూసి పెళ్లి చేసి పంపిస్తాడు . అమెరికా వెళ్లిన పల్లవి జీవితంలోకి అనుకోకుండా ఉమా మహేశ్వర్ రావు వస్తాడు . అతడి రాక వల్ల పల్లవి జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి , చివరకు పల్లవి , ఉమా , అరుణ్ ల జీవితాలు ఏమయ్యాయి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
నాని 
నివేదా థామస్ 
ఆది 
 
డ్రా బ్యాక్స్ : 
 
స్క్రీన్ ప్లే 
 
నటీనటుల ప్రతిభ : 
 
నాని కి తప్పకుండా ఇది డిఫరెంట్ సినిమానే ! నాని క్యారెక్టర్ లో విభిన్న పార్శ్వాలు ఉండటంతో దాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు . నవ్వించడమే కాకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేసాడు అంతేనా ఒకదశలో విలన్ అని కూడా అనిపించాడు . నివేదా థామస్ కు కూడా చాలా మంచి క్యారెక్టర్ లభించింది . పైగా నాని - నివేదా థామస్ ల మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యింది . ఆది పినిశెట్టి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు . మురళీశర్మ , 30 ఇయర్స్ పృథ్వీ , తనికెళ్ళ భరణి తదితరులు తమతమ పాత్రల మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది . యు ఎస్ లొకేషన్స్ ని బాగా క్యాప్చర్ చేసాడు . డివివి దానయ్య నిర్మాణ విలువలు బాగున్నాయి . గోపీసుందర్ సంగీతం యావరేజ్ గానే ఉంది , అయితే రెండు పాటలు బాగున్నాయి . ఇక దర్శకులు శివ విషయానికి వస్తే ..... కథ , కథనం రెండు కూడా బాగా అప్డేట్ అయిన వాళ్లకు నచ్చుతుందేమో కానీ బిసి కేంద్రాలలో ఈ సినిమా నచ్చదు . మెచ్యూర్డ్ లవ్ స్టోరీ ఎంచుకున్నాడు , ట్రీట్ మెంట్ కూడా బాగానే ఇచ్చాడు కానీ తెలుగు వాళ్ళకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు . 
 
ఓవరాల్ గా : 
 
అందరూ కోరుకునే సినిమా కాదు ఈ నిన్ను కోరి


Comments

LATEST GALLERY


Ammayilante Adho Typu Movie Posters


PelliRoju Movie Audio Release


Miya George New Stills


Jai Lava Kusa Movie Jayotsavam


Sathya Dev New Photos


Mahanubhavudu Movie 4 Days To Go Posters


Sushmitha Sen at Banjara Hills


Spyder Movie 2 Days To Go Posters


Neha Deshpande New Photos


Vaadena Movie Teaser Launch


Mahanubhavudu Movie Pre Release Function


Tamannaah Latest Stills


Rachana Choudary Marriage Photos


Jai Lava Kusa New Movie Walls


Catherine & Vijay launch KLM Fashion Mall at Kukatpally

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD