Home రివ్యూస్ నిర్మలా కాన్వెంట్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

నిర్మలా కాన్వెంట్ రివ్యూ



Friday September 16th 2016

Nirmala Convent Review

Rating:

3/5

Direction:

G. Naga Koteswara Rao

Producer:

Nagarjuna Akkineni
Nimmagadda Prasad

Star Cast :

Roshan Meka
Shriya Sharma
Nagarjuna Akkineni

Music :

Roshan Saluri

Production
company:

Annapurna Studios
Matrix Team Works

Release date:

16th September 2016

Genre:

Romance

Censor:

U/A



యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే కింగ్ నాగార్జున మరోసారి హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ తన సహచరుడు నిమ్మగడ్డ ప్రసాద్ తో కలిసి నిర్మించిన చిత్రం ''నిర్మలా కాన్వెంట్ ''. జి . నాగ కోటేశ్వర్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రోషన్ సరసన శ్రియా శర్మ నటించగా అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్ర పోషించాడు . ఈరోజు రిలీజ్ అయిన నిర్మలా కాన్వెంట్ ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 

Nirmala Convent Trailer



 

Editor Review

కథ :  

నిర్మలా కాన్వెంట్ లో నిరంతరం చదువు తప్ప మరో ధ్యాస లేని పుస్తకాల పురుగు అయిన శామ్యూల్ ( రోషన్ ) ఓ పేద కుటుంబానికి చెందినవాడు . అయితే పక్కనున్న అమ్మాయిలను పట్టించు కోకుండా ఉన్న శామ్యూల్ ని డిస్ట్రబ్ చేయాలను కుంటుంది శాంతి ( శ్రియా శర్మ ) కానీ శాంతి ప్లాన్ రివర్స్ అయి తనే శామ్యూల్ ప్రేమలో పడుతుంది అతడి తెలివి తేటలను చూసి . అయితే ఈ  వ్యవహారం శాంతి నాన్న భూపతి రాజు ( ఆదిత్య మీనన్ ) కి తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా శామ్యూల్ తండ్రికి ఉన్న ఒక్కగానొక్క ఎకరం పొలాన్ని రాయించుకొని బెదిరించి పంపిస్తాడు . దాంతో తను ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి శామ్యూల్ ఏం చేసాడు ? ఇంతకీ చివరకు ఏమయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

హైలెట్స్ :   
రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్  , నటన 
శ్రియా శర్మ 
నాగార్జున  
సంగీతం 
ఛాయాగ్రహణం 

డ్రా బ్యాక్స్ : 
రొటీన్ కథ
స్క్రీన్ ప్లే
 
నటీనటుల ప్రతిభ :  
హీరోగా రోషన్ కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ ఆ బెరుకు ఎక్కడా లేకుండా చక్కగా నటించాడు . ఒకటి రెండు సీన్ల లో తప్ప అతడి నటన కు వంక పెట్టడానికి లేదు . పైగా కొన్ని సన్నివేశాల్లో చాలా మెచ్యుర్డ్ గా నటించాడు . ఇక శ్రియా శర్మ గురించి చెప్పడానికి ఏముంది ? బాలనటి గా పలువురు టాప్ స్టార్స్ తో నటించిన శ్రియా శాంతి పాత్రలో తనదైన ముద్ర వేసింది . ఇద్దరి మద్య మంచి కెమిస్ట్రీ కుదిరింది . ఎల్బీ శ్రీరాం పాత్ర చిన్నదే అయినప్పటికీ బేషుగ్గా ఉంది . ఇక కింగ్ నాగార్జున విషయానికి వస్తే నాగ్ వచ్చిన తర్వాత సినిమా మరో లెవల్ కి వెళ్ళింది . మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు . 

సాంకేతిక వర్గం :  
ఈ చిత్రానికి రెండు విభాగాలు హైలెట్ గా నిలిచాయి . ఛాయాగ్రహణం , సంగీతం . రోషన్ సాలూరి అందించిన సంగీతం వినసొంపు గా ఉంది తప్పకుండా అతడికి మంచి ఫ్యూచర్ ఉంటుంది , అలాగే సినిమా మొత్తాన్ని అందంగా చూపించిన ఛాయాగ్రాహకుడు నిజంగా అభినందనీయుడే . నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే సినిమా నిడివి ఎక్కువే ఉంది కొంత ట్రిమ్ చేస్తే బెటర్ ఏమో ! ఇక దర్శకుడు జి నాగ కోటేశ్వర్ రావు విషయానికి వస్తే .............. సాధారణ  కథ నిఎంచుకొన్నాడు స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండేది . అయితే దర్శకుడిని అభినందించతగ్గ విషయం ఏమిటంటే యూత్ ఫుల్ చిత్రాన్ని ఎంచుకొని అసభ్యత కు అశ్లీలత కు ఎక్కడా తావు లేకుండా రూపొందించడం .

ఓవరాల్ గా :  
శ్రీకాంత్ తనయుడు హీరో ,నాగార్జున స్పెషల్ రోల్ వెరసి నిర్మలా కాన్వెంట్ పై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి అయితే ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిస్థాయిలో సక్సెస్  కాలేదని పిస్తుంది . జాయపజయాలను పక్కన పెడితే హీరోగా రోషన్ మెప్పించాడు హీరోయిన్ ఆకట్టుకుంది . ఇద్దరి కెమిస్ట్రీ బాగుంది , అందమైన పాటలు అంతకంటే అందంగా ఉన్న ఫ్రేం డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా , యూత్ ఫుల్ చిత్రం అనగానే శృంగార సన్నివేశాలు , హీరోయిన్ అంగాంగ ప్రదర్శన లేకుండా స్వచ్చమైన ప్రేమలా  చూడచక్కగా ఉంది ఈ నిర్మలా కాన్వెంట్ . యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ చిత్రాన్ని తప్పకుండా ఒకసారి చూడొచ్చు .
Comments

LATEST GALLERY


Dhruva Pre Release Function 2


Druva Pre Release Function


Rakul Preet Singh News Stills 2


Singam3 Trailer Launch


Rakul Preet Singh News Stills


Kadhambari Movie Audio Launch


Pragya New Photos


Vangaveeti Audio Launch


Arundhathi Nayar Latest Stills


Eesha News Stills


Ashwini News Stills


Nandita Swetha


PV Sindhu Watching Ekkadiki Pothavu Chinnavada Movie


Remo Movie Success Meet


Keethi Suresh News Stills

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..