ప్రతీక్షణం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ప్రతీక్షణం రివ్యూ

Murali R | Published:August 18, 2017, 12:00 AM IST

నటీనటులు : తేజస్విని , మనీష్ , మల్లిఖార్జున్ రెడ్డి , దేవరాజ్ 
సంగీతం     : రఘురాం 
నిర్మాత       : మల్లిఖార్జున్ రెడ్డి 
దర్శకత్వం  : శ్రీ నాగ్ 
రేటింగ్        : 2. 75/ 5
రిలీజ్ డేట్  : 18 ఆగస్టు 2017


 

Editor Review
సస్పెన్స్ తో కూడిన హర్రర్ చిత్రాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో ఆ చిత్రాల హవా కొనసాగుతోంది . తేజస్విని ప్రధాన పాత్రలో శ్రీ నాగ్ దర్శకత్వంలో మల్లిఖార్జున్ రెడ్డి నిర్మించిన ప్రతీక్షణం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మేనమామ మల్లిఖార్జున్ రెడ్డి సంరక్షణలో పెరుగుతుంది నిత్యా ( తేజస్విని ) . యాడ్ ఏజన్సీ రన్ చేసే సత్య ( మనీష్ ) తో ప్రేమలో పడుతుంది నిత్యా . అయితే అనూహ్యంగా ఎవరో ఆగంతకులు వచ్చి తనని చంపుతున్నట్లు గా భయపడుతుంటుంది నిత్యా . దాంతో ఆమె ఒంటరి తనాన్ని దూరం చేయడానికి ఫారెస్ట్ లోని గెస్ట్ హౌస్ కి తీసుకెళతాడు సత్య విచిత్రం ఏంటంటే అక్కడ నిత్యా ని ఎవరో చంపడానికి ట్రై చేస్తారు . అయితే నిత్యా ని కాపాడుకోవడానికి సత్య చేసే ప్రయత్నాల్లో భాగంగా సైకాలజిస్ట్ దేవరాజ్ ( దేవరాజ్ ) ని కలుస్తాడు . అతడికి అన్ని విషయాలు చెప్పిన తర్వాత నిత్యా ఇంటికి వచ్చి అన్నీ పరిశీలిస్తాడు దేవరాజ్ . ఆ తర్వాత దేవరాజ్ చెప్పిన విషయాలు విని షాక్ అవుతాడు సత్య . అసలు దేవరాజ్ చెప్పిన విషయం ఏంటి ? నిత్యా ని చంపడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
తేజస్విని గ్లామర్ 
మనీష్ 
ఎంచుకున్న లైన్ 
నిర్మాణ విలువలు 
 
డ్రా బ్యాక్స్ : 
స్క్రీన్ ప్లే 
 
నటీనటుల ప్రతిభ : 
 
నిత్యా గా గ్లామర్ తార తేజస్విని బాగా ఆకట్టుకుంది , ముఖ్యం గా హీరో మనీష్ కు తేజస్విని మధ్య రొమాంటిక్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి . అలాగే తేజస్విని అందాలు కుర్రాళ్ళని కట్టి పడేశాయి . ఇక హీరో మనీష్ విషయానికి వస్తే అందంగా ఉన్నాడు అలాగే అంతకంటే అందంగా నటించాడు కూడా . సీనియర్ నటుడు దేవరాజ్ సైకాలజిస్ట్ గా మెప్పించాడు . మల్లిఖార్జున్ రెడ్డి కూడా ఫరవాలేదని పించాడు . ఇక మిగిలిన పాత్రలలో ఆయా నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
కళ్యాణ్ సమీ అందించిన ఛాయాగ్రహణం బాగుంది , అలాగే రఘురాం స్వరపరిచిన పాటలు కూడా బాగున్నాయి .ఖర్చుకు వె నుకాడకుండా నిర్మించిన   నిర్మాణ విలువలు బాగున్నాయి . ఇక దర్శకుడు శ్రీ నాగ్ విషయానికి వస్తే మంచి లైన్ ని ఎంచుకున్నాడు . అయితే ఆ లైన్ కు తగ్గ రీతిలో స్క్రీన్ ప్లే రూపొందించు కొని ఉంటే మరింతగా బాగుండేది . శ్రీ నాగ్ ప్రతీక్షణం లైన్ ఎంచుకొని  మంచి ప్రయత్నమే చేసాడు . 
 
ఓవరాల్ గా : 
 
సస్పెన్స్ , హర్రర్ ఎలిమెంట్స్ కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ ఈ ప్రతీక్షణం 


Comments

LATEST GALLERY


Garuda Vega Movie Trailer Launch


Mahanati Movie Posters


Mehreen Kaur Latest Stills


Keerthi Suresh Birthday Photos


Krishna Rao Supermarket Movie Opening


Elsa Ghosh New Photos


Raju Gari Gadhi 2 Movie Success Meet


Seerat Kapoor Latest Stills


Samantha New Stills


Raja The Great Movie New Walls


Priyanka Naidu Latest Stills


Raja The Great Pre Release Function


Lavanya Tripathi New Photos


Anupama Parameshwaran New Photos


Anisha Ambrose New Stills

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD