Home రివ్యూస్ రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

రారండోయ్ వేడుక చూద్దాం రివ్యూSaturday May 27th 2017

నటీనటులు    : నాగచైతన్య , రకుల్ ప్రీత్ సింగ్ , జగపతిబాబు 
సంగీతం        : దేవిశ్రీ ప్రసాద్ 
నిర్మాత         : అక్కినేని నాగార్జున 
దర్శకత్వం      : కళ్యాణ్ కృష్ణ 
రేటింగ్          : 3/ 5
రిలీజ్ డేట్      : 26 మే 2017


 

Editor Review
సోగ్గాడే చిన్ని నాయనా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ అనే దర్శకుడు మళ్ళీ నాగార్జున కాంపౌండ్ లోనే చేసిన సినిమా '' రారండోయ్ వేడుక చూద్దాం '' . నాగచైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంతో కళ్యాణ్ కృష్ణ రెండో సినిమా సెంటిమెంట్ ని అధిగమించి హిట్ అందుకున్నాడా ? లేదా ? తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ
భ్రమరాంభ ( రకుల్ ప్రీత్ సింగ్ ) నాన్న కూచి . తన కుటుంబం అందునా నాన్న అంటే అమితమైన ఇష్టం , అలాగే భ్రమరాంభ అన్నా కూడా కుటుంబం అంతటికీ చాలా ఇష్టం కూడా . అలాంటి భ్రమరాంభ ని చూసి మొదటి చూపులోనే ప్రేమిస్తాడు శివ ( నాగచైతన్య ) . ఉన్నత చదువుల కోసం భ్రమరాంభ వైజాగ్ కు వస్తుంది . అక్కడ అన్నీ తానై చూసుకుంటాడు శివ కానీ భ్రమరాంభ మాత్రం శివ మనసు అర్ధం చేసుకోకుండా రాజకుమారుడి లాంటి వాడ్ని పెళ్లి చేసుకుంటానని శివ ని అవమానపరుస్తుంది . తన బావతో పెళ్ళికి సిద్దమైన నేపథ్యంలో శివ మనసు ఏంటో అర్ధం అవుతుంది భ్రమరాంభకు దాంతో నాన్న అనుమతి తో బావని కాకుండా శివ ని పెళ్లి చేసుకోవాలనుందని చెబుతుంది ,అయితే శివ తండ్రి అంటే గిట్టని భ్రమరాంభ తండ్రి ఆ పెళ్ళికి నిరాకరిస్తాడు . ఇంతకీ భ్రమరాంబ తండ్రికి , శివ తండ్రికి ఉన్న వైరం ఏంటి ? ఎందుకు శివ తో పెళ్ళి వద్దని వారించాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్
నాగచైతన్య 
 రకుల్ ప్రీత్  ట్రెడిషనల్ గెటప్ 
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం 
ఛాయాగ్రహణం 
 
డ్రా బ్యాక్స్
కామెడీ అంతగా ఆకట్టుకునేలా లేకపోవడం 
నిడివి ఎక్కువ 
 
నటీనటుల ప్రతిభ
 
భ్రమరాంభ పాత్రకు  రకుల్ ప్రీత్ సింగ్ ప్రాణం పోసింది . తన కట్టు బొట్టు తో సరికొత్త రకుల్ కనిపించింది ఈ చిత్రంలో . నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడంతో సత్తా చూపించింది . అలాగే చైతూ తో పోటీ పడి మరీ నటించింది . ఇక నాగచైతన్య విషయానికి వస్తే అతడికి కూడా మంచి పాత్ర లభించింది . మంచి జోష్ తో ఆ పాత్ర పోషించి మెప్పించాడు నాగచైతన్య, బ్రేకప్ సమయంలో చైతూ నటన చాలా బాగుంది  . సంపత్ కు కూడా మంచి పాత్ర లభించింది . అలాగే జగపతిబాబు తో పాటు ఇతర పాత్రల్లో నటించిన మిగతా నటీనటులు తమతమ పాత్రల పరిధిమేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం
 
ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ ఛాయాగ్రహణం . సినిమా కలర్ ఫుల్ గా నిండుగా అందంగా కనిపించడానికి చేసిన కృషి అభినందనీయమే . అలాగే దావిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా బాగుంది . పాటలు  బాగున్నాయి అంతకంటే అందమైన ప్రదేశాలలో షూట్ చేసారు . అన్నపూర్ణ స్టూడియోస్  నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పడానికేముంది . చాలా ఖర్చు పెట్టి మరీ తీశారు . ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ విషయానికి వస్తే పెద్ద ఎత్తున నటీనటులను ఎంచుకున్నాడు కానీ అందరివి ప్రాముఖ్యత ఉన్న పాత్రలు కావు . అయితే తండ్రి కూతుర్ల మధ్య సీన్ల ని అలాగే చైతూ - రకుల్ ల మధ్య మంచి సన్నివేశాలను ఎలివేట్ చేయగలిగాడు . మరింత ఎఫెక్టివ్ గా కథ , కథనం రాసుకొని ఉంటే రారండోయ్ వేడుక చూద్దాం పెద్ద హిట్ అయి ఉండేది . 
 
ఓవరాల్ గా
నాగచైతన్య - రకుల్ ల కోసం రారండోయ్ వేడుక చూద్దాం . 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD