రథావరం రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

రథావరం రివ్యూ

Murali R | Published:September 2, 2017, 12:00 AM IST

నటీనటులు      : శ్రీ మురళి , రచితా రాయ్ , రవిశంకర్ తదితరులు 
సంగీతం          : ధర్మ విష్ 
ఛాయాగ్రహణం : భువన్ గౌడ 
నిర్మాత            : ధర్మశ్రీ మంజునాధ్ 
దర్శకత్వం       : చంద్రశేఖర్ బండయప్ప 
రేటింగ్             : 2.75/ 5
రిలీజ్ డేట్       : 1 సెప్టెంబర్ 2017


 

Editor Review
కన్నడంలో సూపర్ హిట్ అయి భారీ వసూళ్లు సాధించిన '' రథావరం '' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ముందుకు వచ్చాడు ధర్మశ్రీ మంజునాధ్ . విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండయప్ప దర్శకత్వం వహించాడు . మరి కన్నడ నాట హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
రథావరం ( శ్రీ మురళి )ఎం ఎల్ ఏ మణికంఠ ( రవిశంకర్ ) కోసం ఎంతటి సాహసానికైనా పూనుకునే మనస్తత్వం ఉన్న అనుచరుడు . తాను ఆరాధించే నాయకుడు ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడుతుంటాడు . అయితే నాయకుడు సీఎం కావాలంటే మరణించిన హిజ్రా ముఖం చూస్తే మణికంఠ సీఎం అవుతాడని స్వామిజీ చెప్పిన మాటలు నమ్మి చనిపోయిన హిజ్రా కోసం వేట ప్రారంభిస్తాడు రథావరం . కానీ చనిపోయిన హిజ్రా ముఖాలను చూడటం సాధ్యం కాదని పైగా అది తప్పని తెలుసుకొని రియలైజ్ అవుతాడు రథావరం . తన ఆశయం నెరవేరుతుందని ఆశించిన మణికంఠ రథావరం ఇచ్చిన షాక్ నుండి తేరుకున్నాడా ? మణికంఠ తన ఆశయం కోసం రథావరం ని ఏం చేసాడు ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
శ్రీ మురళి 
రవిశంకర్ 
చరణ్ రాజ్ 
రచితా గ్లామర్ 
కథ 
ఫస్టాఫ్ 
సంగీతం 
 
డ్రా బ్యాక్స్ : 
 
సెకండాఫ్ 
లవ్ ట్రాక్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
రథావరం పాత్రలో మెప్పించి  మాస్ గెటప్ లో అదరగొట్టాడు శ్రీ మురళి . రచితా రాయ్ గ్లామర్ తో ఆకట్టుకుంది , అందం తోనే కాకుండా అభినయం తో కూడా ఆకట్టుకుంది . పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ రాజ్ రాణించాడు .సాధు కోకిల నవ్వుల పువ్వులు పూయించాడు .  ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే రాణించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
సినిమా మూడ్ కి తగ్గట్లుగా విజువల్స్ అందించి మంచి మార్కులు కొట్టేసాడు ఛాయాగ్రాహకులు భువన్ గౌడ్ . ప్రేక్షకుల అటెన్షన్ మిస్ అవ్వకుండా అద్భుతమైన విజువల్ ట్రీట్ అందించాడు . ధర్మ విష్ సంగీతం కూడా ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది . పాటల తో పాటు నేపథ్య సంగీతంతో కూడా అలరించాడు ధర్మవిష్ . నిర్మాణ విలువలు బాగున్నాయి , డబ్బింగ్ సినిమా అయినప్పటికీ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వ్యవహరించాడు నిర్మాత . ఇక దర్శకులు విషయానికి వస్తే ...... హిజ్రా ల నేపథ్యానికి రాజకీయ క్రీడని జోడించి రసవత్తరంగా నడిపించి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు . విభిన్న కథాంశాన్ని ఎంచుకున్న దర్శకుడు ఫస్టాఫ్ ని అద్భుతంగా రాసుకున్నప్పటికీ సెకండాఫ్ కు వచ్చేసరికి కొంత తడబడ్డాడు . 
 
ఓవరాల్ గా : 
 
హిజ్రాల నేపథ్యానికి రాజకీయాన్ని జోడించి చేసిన మంచి ప్రయత్నం ఈ రథావరం . 


Comments

LATEST GALLERY


Rakul Preet Singh New Gallery


Kanam Movie Poster


WWW.Meenabazar Movie Pressmeet


Sreejitha Latest Stills


Allu Arjun Launches Buffalo Wild Wings Restaurant


Mahima Latest Stills


Indrasena Movie Audio Launch


Radhika New Photos


Diana Champika New Stills


Pallavi New Photos


Naga Shaurya's Chalo Movie Poster


Gruham Movie Pressmeet


Spyder Movie 50Days New Poster


Rakul Preet Singh New Movie Stills


Pallavi Dora New Gallery

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD