శమంతకమణి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

శమంతకమణి రివ్యూ

Murali R | Published:July 14, 2017, 12:00 AM IST

నటీనటులు   : నారా రోహిత్ , ఆది , సందీప్ కిషన్ , సుధీర్ బాబు ,రాజేంద్రప్రసాద్ 
సంగీతం       : మణిశర్మ 
నిర్మాత       : ఆనంద్ ప్రసాద్ 
దర్శకత్వం    : శ్రీరామ్ ఆదిత్య 
రేటింగ్        : 3/ 5
రిలీజ్ డేట్    : 14 జూలై 2017


 

Editor Review
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ , నారా రోహిత్ , ఆది , సందీప్ కిషన్ , సుధీర్ బాబు ల కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మించిన చిత్రం '' శమంతకమణి '' . ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
శమంతకమణి ( రోల్స్ రాయిస్  ) 5 కోట్ల విలువైన కారు ని ఎవరో దొంగిలిస్తారు , ఆ కేసు చేధించే పనిని ఇన్స్ పెక్టర్ రంజిత్ కుమార్ (నారా రోహిత్ ) కు అప్పగిస్తారు దాంతో ఆ కారుని ఎవరు ఆ కారుని దొంగిలించారో కనుక్కునే పనిలో పడతాడు రంజిత్ కుమార్ . అందులో భాగంగా మెకానిక్ మహేష్ బాబు ( రాజేంద్రప్రసాద్ ) ని కోటిపల్లి శివ ( సందీప్ కిషన్ ) ని అలాగే కార్తీక్ ( ఆది ) లని అరెస్ట్ చేస్తాడు . ఈ ముగ్గురిలో ఆ కారుని దొంగిలించింది ఎవరు ? శమంతకమణి కారుకి కృష్ణ ( సుధీర్ బాబు ) కి సంబంధం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
రాజేంద్రప్రసాద్ 
ఆది క్యారెక్టర్ 
స్క్రీన్ ప్లే 
సెకండాఫ్ 
రఘు కామెడీ 
నారా రోహిత్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
ఫస్టాఫ్ 
 
నటీనటుల ప్రతిభ:
 
ఇన్ స్పెక్టర్ రంజిత్ కుమార్ పాత్రలో మెప్పించాడు నారా రోహిత్ , ఇప్పటికే పలు చిత్రాల్లో పోలీస్ గా నటించాడు కాబట్టి మరింత భేషుగ్గా నటించాడు రంజిత్ కుమార్ గా , ఇక మిగిలిన హీరోలలో ఆది క్యారెక్టర్ కు ఎక్కువగా మార్కులు పడతాయ్ , కార్తీక్ పాత్రలో ఆకట్టుకున్నాడు ఆది . అతడికి ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అవుతుంది . సుధీర్ బాబు పాత్ర ఎమోషనల్ గా సాగుతుంది , అతడు కూడా బాగా చేసాడు కానీ వాయిస్ కాస్త మైనస్ గా మారింది . సందీప్ కిషన్ కూడా కోటిపల్లి శివ పాత్రలో మెప్పించాడు . ఇక రాజేంద్ర ప్రసాద్ పాత్ర కూడా బాగానే ఉంది , నవ్వులు పంచింది . రఘు కామెడీ తో అలరించాడు . 
 
సాంకేతిక వర్గం : 
 
మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరింత ప్లస్ అయ్యింది . ఛాయాగ్రహణం బాగుంది , నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి ఇక దర్శకులు శ్రీరామ్ ఆదిత్య విషయానికి వస్తే ఫస్టాఫ్ ని అంతగా ఆకట్టుకునేలా రూపొందించలేదు కానీ సెకండాఫ్ లో మాత్రం తనదైన స్క్రీన్ ప్లే తో మెప్పించాడు , అలాగే ఫన్ జనరేట్ అయ్యేలా డైలాగ్స్ అందించి మార్కులు కొట్టేసాడు . ఫస్టాఫ్ ని కూడా మరింత ఆసక్తికరంగా రాసుకొని ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అయ్యేది . 
 
ఓవరాల్ గా : శమంతకమణి అలరించే సినిమా .


Comments

LATEST GALLERY


Dil Raju Birthday Press Meet Photos


MCA Movie Posters


Chalo Movie Stills


MCA Pre Release Event Photos


MCA Movie Posters


Sana Makbul Latest Stills


Suriya Gang Movie First Look


2 Countries Movie Audio Launch


Sony Charishta Latest Photos


Deeksha Panth New Stills


Victory Venkatesh.Latest Stills


Juliat Lover of Idiot Press Meet


Agnyathavasi Movie Poster


Dr Rajasekhar walks on Marks and Spencer London Fashion Show


Celbs at Maa Curtain Raiser Function

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD