Home రివ్యూస్ సిద్దార్థ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

సిద్దార్థ రివ్యూ



Friday September 16th 2016

Siddhartha Review

Rating:

0.5/5

Direction:

Dayanand Reddy

Producer:

Dasari Kiran

Star Cast :

Sagar, Ragini Nandwani, Kota & Others

Music :

Manisharma

Release date:

16th September 2016

Genre:

Drama Film/Romance

Censor:

U/A



టివి నటుడు సాగర్ హీరోగా దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన చిత్రం '' సిద్దార్థ ''. ఈరోజు రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 



 

Editor Review
కథ : 
సిద్దార్థ ( సాగర్ ) ఇండియా నుండి మలేషియా వెళుతున్న సమయంలో సహస్ర ( రాగిణి నంద్వని ) ని చూసి లవ్ లో పడతాడు . ఇండియాలో అంకినీడు మనుషులు వెతుకుతున్నారని తెలిసి మలేషియాలోనే ఉంటే సేఫ్ అని భావిస్తారు . అయితే అనూహ్యంగా రెండు కుటుంబాల మద్య రాజీ కుదిర్చడానికి పంతాలు పక్కన పెట్టి పెళ్లి తో ఒక్కటైతే బాగుంటుందని రాజీ ఫార్ములా తెరముందుకు తీసుకువస్తారు . దాంతో సహస్ర ని వదిలి ఇండియాకు వస్తాడు సిద్దార్థ . అసలు సిద్దార్థ కుటుంబానికి అంకినీడు కుటుంబానికి ఉన్న గొడవలు ఏంటి ? సిద్దార్థ అసలు పేరు ఏంటి ? చివరకు సహస్ర సిద్దార్థ సొంతం అయ్యిందా ? లేదా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ :  
బూతద్దం పెట్టి వెదికినా ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకదు 
 
డ్రా బ్యాక్స్ : 
ఎన్నని చెప్పాలి .................. ఎన్నని రాయాలి , సినిమా మొత్తం 
 
సాంకేతిక వర్గం :  
మాటలు పరుచూరి బ్రదర్స్ కానీ ఒక్క డైలాగ్ కూడా బాగోలేదు , సంగీతం మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఎబ్బెట్టు గా ఉంది ఇక పాటల సంగతి చెప్పనక్కర్లేదు . ఛాయాగ్రహణం బాగుంది ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా చాలా ఎడిటింగ్ చేయాలి కానీ ఎందుకనో వదిలేసారు . దర్శకుడు విషయానికి వస్తే ................. పవన్ కళ్యాణ్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన దయానంద్ రెడ్డి దర్శకుడి గా పూర్తిగా విఫలం అయ్యాడు . ఏ ఒక్క సీన్ ని కూడా రసవత్తరంగా రూపొందించుకోలేక పోయాడు . 
 
నటీనటుల ప్రతిభ : 
పేరుకి చాలామంది నటీనటులు ఉన్నారు కానీ ఒక్కరి పాత్ర కూడా ఆకట్టుకునేలా లేదు . ఇక సాగర్ విషయానికి వస్తే ఒకేరకమైన ఎక్స్ ప్రేషన్స్ తో ఇబ్బంది కలిగించాడు . 
 
ఓవరాల్ గా : 
బుల్లితెర పై స్టార్ గా అవతరించిన సాగర్ హీరో అనగానే ఒకరమైన అంచనాలు ఏర్పడ్డాయి సిద్దార్థ చిత్రంపై కానీ ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా పూర్తిగా విఫలం అయ్యింది . ఈ సినిమాకు వెళితే కుమిలిపోవడం ఖాయం . సిద్దార్థ దరిదాపుల్లోకి వెళితే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం . ఓవరాల్ గా ఇది పరమ చెత్త సినిమా .
Comments

LATEST GALLERY


Ghazi Movie Trailer Launch


Taapsee Pannu Latest Stills


Anjali Chitrangada Movie Stills


Monika Singh Stills


Mannara Chopra News Stills


Sree Valli Audio Launch


Neha Hinge Latest Stills


Prema Biksha Movie Stills


Sunday Soul Sante Event


Gunturodu Movie Stills


Farrah Photos


Balakrishna Dallas Trip Photos


Commando 2 Movie Poster


KANNAYYA MOVIE FIRST LOOK


Geetapuri Colony Audio Launch

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..