Home రివ్యూస్ వాసుకి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

వాసుకి రివ్యూThursday July 27th 2017

నటీనటులు       : మమ్ముట్టి , నయనతార తదితరులు
సంగీతం           : గోపిసుందర్
నిర్మాత             : ఎస్ ఆర్ మోహన్
దర్శకత్వం       : ఏకే సాజన్
రేటింగ్             : 3/ 5
రిలీజ్ డేట్       : 28 జూలై 2017


 

Editor Review
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి , నయనతార జంటగా నటించిన చిత్రాన్ని తెలుగులో '' వాసుకి '' గా డబ్ చేసారు నిర్మాత ఎస్ ఆర్ మోహన్ . ఏకే సాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించగా రేపు రిలీజ్ అవుతోంది . అయితే హిట్ అయిన సినిమా కావడం , బర్నింగ్ ఇష్యూ కావడంతో సినిమాపై నమ్మకంతో ఒకరోజు ముందుగానే మీడియాకు సినిమా వేశారు . ఇక కథ , కథనం ఎలా ఉందో ఓ లుక్కేద్దామా !
 
కథ :
 
వాసుకి ( నయనతార ) కథాకళి డ్యాన్సర్ ,విడాకుల స్పెషలిస్ట్ అయిన లాయర్ వెంకట్ ( మమ్ముట్టి ) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది . లాయర్ అయిన వెంకట్ పార్ట్ టైం జాబ్ గా ఛానల్ లో కూడా పని చేస్తుంటాడు . వీళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది . ప్రేమ వివాహం కావడంతో వెంకట్ తల్లి వాసుకి ని ఇంట్లోకి రానివ్వదు దాంతో మరోచోట అపార్ట్ మెంట్ లో ఉంటారు వెంకట్ వాసుకి లు . అయితే అదే అపార్ట్ మెంట్ లో ఉండే పాండు ,ఆర్య , సుధీర్ వర్మ ల వల్ల వాసుకి కి తీరని అన్యాయం జరుగుతుంది . దాంతో భర్తకు ఆ విషయం చెప్పకుండా  ఆ ముగ్గురి పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుంది . ఇంతకీ వాసుకి కి జరిగిన అన్యాయం ఏంటి ? ఆ ముగ్గురి పై వాసుకి రివేంజ్ తీర్చుకుందా ? ఆ సమయంలో వాసుకి కి సహాయం చేసిన వాళ్ళు ఎవరు ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
నయనతార 
మమ్ముట్టి 
సెకండాఫ్ 
క్లైమాక్స్ 
గోపిసుందర్ రీ రికార్డింగ్ 
 
డ్రాబ్యాక్స్ : 
 
ఫస్టాఫ్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
మమ్ముట్టి - నయనతార జంట చూడముచ్చటగా ఉంది , ఇక వాసుకి పాత్రలో నయనతార ని తప్ప మరొకరిని ఊహించుకోలేం అంత బాగా చేసింది . సాధారణంగా గ్లామర్ తారలు ఇలాంటి పాత్రలను ఒప్పుకోవడం ఒకింత సాహసమనే చెప్పాలి . మమ్ముట్టి విషయానికి వస్తే మొదటి భాగంలో సాధారణంగా కనిపించిన క్యారెక్టర్ సెకండాఫ్ లో అందునా క్లైమాక్స్ లో టెక్నాలజీ తో చేయించిన హత్యలతో సగటు భర్త ని తలపించాడు . హీరోఇజం అంటే ఫైట్లు , డ్యాన్స్ లు మాత్రమే కాదు అంటూ సరికొత్త కోణంలో ఆవిష్కరించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
గోపిసుందర్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది . అలాగే రోబీ ఛాయాగ్రహణం కూడా సినిమా మూడ్ కి తగ్గట్లుగా ఉంది . డబ్బింగ్ సీమ అయినప్పటికీ ఎక్కడా ఆ భావన రాకుండా క్వాలిటీ చూపించారు ఎస్ ఆర్ మోహన్ . ఇక దర్శకుడు ఏకే సాజన్  విషయానికి వస్తే ........ దేశ వ్యాప్తంగా బర్నింగ్ ఇష్యు ఇది , అలాగే హైదరాబాద్ లో గతకొంత కాలంగా ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్న డ్రగ్స్ , గంజాయి అంశాలు కూడా ఈ సినిమాని త్వరగా ఓన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది . సాజన్ మంచి కథ ని ఎంచుకొని టెక్నాలజీని అడ్డుపెట్టుకొని ఎలా సమస్య నుండి ఉపశమనం పొందవచ్చో చక్కగా చూపించాడు . ఫస్టాఫ్ ని సాదా సీదాగా నడిపించిన సాజన్ సెకండాఫ్ లో అసలు కథ ని చెబుతూ ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యేలా చేసాడు . 
 
ఓవరాల్ గా : 
 
వాసుకి ప్రేక్షకులు మెచ్చే సినిమా
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD