వివేకం మూవీ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

వివేకం మూవీ రివ్యూ

Murali R | Published:August 24, 2017, 12:00 AM IST

నటీనటులు : అజిత్ , కాజల్ అగర్వాల్ , అక్షర హాసన్ తదితరులు 
సంగీతం     : అనిరుద్ రవిచందర్ 
నిర్మాతలు   : త్యాగరాజన్ 
దర్శకత్వం  : శివ 
రేటింగ్        : 2.5 / 5
రిలీజ్ డేట్  : 24 ఆగస్టు 2017


 

Editor Review

 తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటించిన చిత్రం '' వివేకం ''. తెలుగు దర్శకుడు శివ అజిత్ తో కలిసి రెండు సూపర్ హిట్ తమిళ చిత్రాలను అందించాడు వీరం , వేదళం . ఆ రెండు హిట్ ల తర్వాత వస్తున్న చిత్రం ఈ వివేగం . తెలుగులో వివేకం గా వస్తున్న ఈ సినిమాపై అజిత్ తెలుగులో మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకునేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 

 

కథ : 

యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పనిచేసే అజయ్ కుమార్ ( అజిత్ కుమార్ ) తన నలుగురు స్నేహితులతో కలిసి 279 మిషన్ లను విజయవంతంగా కంప్లీట్ చేస్తాడు . అయితే 280వ మిషన్ లో పాల్గొన్న సమయంలో అర్దాంతరంగా అదృశ్యమౌతాడు అజయ్ కుమార్ . అతడి పట్టుకునే నిమిత్తం అజయ్ కుమార్ స్నేహితుల సహాయం తీసుకుంటారు ఎఫ్ బి ఐ . అజయ్ కుమార్ అదృశ్యం కావడానికి కారకులు ఎవరు ? వరల్డ్ వైడ్ గా కృత్రిమ భూకంపాలు సృష్టించి ప్రపంచ వినాశనానికి పాల్పడుతున్న వాళ్ళు ఎవరు ? అజయ్ కుమార్ ఆ ప్రయత్నాలను అడ్డుకున్నాడా ? ప్రపంచ వినాశనానికి పాటుపడుతున్న వాళ్ళని అంతం చేశాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 

 

హైలెట్స్ : 
 
అజిత్ నటన 
గ్రాండ్ విజువల్స్ 
అనిరుద్ రీ రికార్డింగ్ 
హాలీవుడ్ స్థాయి మేకింగ్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
కథ 
కథనం 
 
నటీనటుల ప్రతిభ : 
 
అజిత్ లుక్స్ పరంగా కానీ మేకోవర్ పరంగా చాలా స్టైలిష్ గా కనిపించాడు . ఇక ఈ సినిమాని తన భుజ స్కంధాలపై మోసి మొత్తం మార్కులు కొట్టేసాడు అజిత్ . యాక్షన్ దృశ్యాలలో మరింత అద్భుతంగా నటించాడు . కాజల్ అగర్వాల్ కు ఉన్నంతలో నటనకు అవకాశం ఉన్న పాత్రే లభించింది , గ్లామర్ కు స్కోప్ లేకుండా పోయింది . ఇక అక్షర హాసన్ విషయానికి వస్తే చిన్న పాత్రే అయినప్పటికీ గుర్తుండిపోయే పాత్ర . ఇక విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ మరోసారి మెప్పించాడు . ఇప్పటికే విలన్ గా సత్తా చాటాడు వివేక్ , మరోసారి నమ్మకద్రోహం చేసే పాత్ర లభించడంతో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు . 
 
సాంకేతిక వర్గం : 
 
హాలీవుడ్ రేంజ్ ని తలపించే విధంగా గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకున్నాడు ఛాయాగ్రాహకుడు వెట్రి . అలాగే సంగీత దర్శకుడు అనిరుద్ కూడా అద్భుతమైన నేపథ్య సంగీతం అందించి సినిమాని మరో లెవల్ లో నిలబెట్టాడు , ముఖ్యం గా యాక్షన్ దృశ్యాలలో అనిరుద్ రీ రికార్డింగ్ అదుర్స్ . ఖర్చుకు వెనుకాడకుండా భారీతనం అంటే ఏమిటో మేకింగ్ ద్వారా చూపించారు ఈ చిత్ర నిర్మాతలు . ఇక దర్శకుడు శివ విషయానికి వస్తే ....... హాలీవుడ్ సినిమాని తలపించేలా తన టేకింగ్ తో ప్రేక్షకులను అబ్బుర పరిచాడు . టేకింగ్ అద్వితీయంగా ఉంది నో డౌట్ అయితే కథ , కథనం బిసి కేంద్రాలలోని ప్రేక్షకులను అలరించేలా ఉందా అంటే డౌటే !
 
ఓవరాల్ గా : 
 
హాలీవుడ్ తరహా సినిమాలు కోరుకునే వాళ్లకు మంచి ఛాయిస్ ఈ వివేకం 


Comments

LATEST GALLERY


FAAS Award Function Photos


2 Friends Movie Stills


Pawan Kalyan Launched the Teaser of Sunil Two Countries


Sapthagiri LLB 2nd Song Sai dharam tej Launch Stills


Namitha Wedding Photos


PSPK25 Pre-Look Poster


A glimpse from NKR15 Kalyan Ram and Tamannah Bhatia


Oxygen Movie Stills


Vishnu Manchu Voter First Look


Sharwanand New Movie Opening Stills


Hey Pillagada Movie Posters


Lakshmi Manchu Latest Gallery


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD