అమీ తుమీ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

అమీ తుమీ రివ్యూ

Murali R | Published:June 9, 2017, 12:00 AM IST

నటీనటులు   : అడవి శేష్ , వెన్నెల కిషోర్ , ఈషా , తనికెళ్ళ భరణి 
సంగీతం       : మణిశర్మ 
నిర్మాత       : నరసింహారావు 
దర్శకత్వం    : మోహనకృష్ణ ఇంద్రగంటి 
రేటింగ్        : 2.5/ 5
రిలీజ్ డేట్    : 9 జూన్ 2017


 

Editor Review
నాని తో చేసిన జెంటిల్ మన్ తో మళ్ళీ గాడిలో పడిన మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అమీ తుమీ . కామెడీ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
దీపిక ( ఈషా )  అనంత్ ( అడవి శేష్ ) అనే డబ్బు లేనివాడ్ని ప్రేమిస్తుంది . అయితే కోటీశ్వరుడైన దీపిక తండ్రి జనార్దన్ (తనికెళ్ళ భరణి )వాళ్ళ ప్రేమకు ఒప్పుకోడు . శ్రీ చిలిపి ( వెన్నెల కిషోర్ ) అనే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని కూతురు దీపిక ని గదిలో బంధిస్తాడు జనార్దన్ . అనంత్ ని పెళ్లి చేసుకోవాలని ఆశపడిన దీపిక ఇంట్లో నుండి తప్పించుకొని వస్తుంది . బయటకు వచ్చాక దీపిక ఎలాంటి ప్లాన్లు వేసింది , శ్రీ చిలిపి ని ఎలా ఇబ్బంది పెట్టింది .  ప్రియుడి ని ఎలా దక్కించుకుంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
 
వెన్నెల కిషోర్ 
ఈషా 
ఎంటర్ టైన్మెంట్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
సీరియల్ కు ఎక్కువ సినిమాకు తక్కువగా ఉన్న కథనం 
 
నటీనటుల ప్రతిభ : 
 
శ్రీ చిలిపి పాత్రలో సీరియస్ గా ఉంటూనే కామెడీ పండించి ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ గా నిలిచాడు వెన్నెల కిషోర్ . తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు వెన్నెల కిషోర్ . హీరోయిన్ ఈషా అందంగా కనిపించింది అలాగే మరింత అందంగా నటించింది కూడా . అవసరాల శ్రీనివాస్ పాత్ర తక్కువే ! ఇక ఉన్నంతలో అడవి శేష్ , తనికెళ్ళ భరణి , అదితి మైఖేల్ తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి బూతు డైలాగులు రాయకుండా చక్కని హాస్యం ని అందించాడు . కథ యావరేజ్ అయినప్పటికీ కథనం కు హాస్యం ని జోడించి మెప్పించాడు . నిర్మాత నరసింహారావు నిర్మాణ విలువలు యావరేజ్ గా ఉన్నాయి . మణిశర్మ సంగీతం ఫరవాలేదు అలాగే పిజి విందా ఛాయాగ్రహణం సినిమాకు ప్లస్ అయ్యింది . 
 
ఓవరాల్ గా : 
 
ట్విస్ట్ లు గట్రా లేకుండా వినోదాన్ని అందించిన అమీ తుమీ .


Comments

LATEST GALLERY


Manasuki Nachindi Movie Stills


Pawan Kalyan Family at St Mary's Stills


Tholi Prema Movie Audio Launch


Raashi Khanna New Photos


Pragya Jaiswal Latest Stills


Tholi Prema Movie Stills


Achari America Yatra Pre Release Function


Naresh Birthday Celebrations Stills


Director Maruthi Naga Chaitanya Movie Opening Stills


Howrah Bridge Movie Stills


Achari America Yatra Poster and Still


Tik Tik Tik Movie Trailer Launch by Sai Dharam Tej


Touch Chesi Choodu Movie Stills


NTR's Death Anniversary Day 2018 at NTR Ghat


Mohan Babu Felicitation by TSR Kakatiya Lalitha Kala Parishad

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD