Home రివ్యూస్ అంధగాడు రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

అంధగాడు రివ్యూ



Friday June 02nd 2017

నటీనటులు : రాజ్ తరుణ్ , హెబ్బా పటేల్ , రాజేంద్ర ప్రసాద్ 
సంగీతం : శేఖర్ చంద్ర 
నిర్మాత : సుంకర రామబ్రహ్మం 
దర్శకత్వం : వలిగొండ శ్రీనివాస్ 
రేటింగ్ : 2. 75/ 5
రిలీజ్ డేట్ : 2 జూన్ 2017


 

Editor Review
కుమారి 21f , ఈడోరకం ఆడోరకం చిత్రాల సక్సెస్ తర్వాత రాజ్ తరుణ్ - హెబ్బా పటేల్ కలిసి నటించిన చిత్రం ఈ '' అంధగాడు ''. వరుసగా చిత్రాలు చేస్తూ విజయాలు సాధిస్తున్న ఈ జంట ముచ్చటగా మూడోసారి జతకట్టింది . మరి ఈ సినిమాతో సక్సెస్ రిపీట్ చేసారా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
కథ : 
 
గౌతమ్ ( రాజ్ తరుణ్ ) ఓ అంధుడు . అంధుల ఆశ్రమంలో ఉండే గౌతమ్ సడెన్ గా ఆ ఆశ్రమం నుండి బయటకు వచ్చి ఓ ఎఫ్ ఎం ఛానల్ లో ఆర్జే గా పనిచేస్తుంటాడు . అదే సమయంలో డాక్టర్  నేత్ర ( హెబ్బా పటేల్ ) పరిచయం అవుతుంది . కళ్ళు రావాలని ఆశపడే గౌతమ్ తాను ఓ గుడ్డి వాడిని అన్న నిజం నేత్ర కు తెలియకుండా జాగ్రత్త పడతాడు . అయితే నిజం ఎంతో కాలం దాగదు కాబట్టి గౌతమ్ ఓ అంధుడు అన్న నిజం నేత్ర కు తెలుస్తుంది . గౌతమ్ పట్ల కోపం ఉన్నప్పటికీ అతడికి చూపు వచ్చేలా చేస్తుంది నేత్ర. అయితే చూపు వచ్చిన నేత్రకు ఆత్మ కనిపిస్తూ అతడి చేత చేయకూడని పనులు చేయిస్తుంటుంది . అసలు ఆ ఆత్మ ఎవరు ? గౌతమ్ చేతనే హత్యలు ఎందుకు చేయిస్తుంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .
 
హైలెట్స్ : 
 
రాజ్ తరుణ్ నటన 
హెబ్బా పటేల్ గ్లామర్ 
రాజేంద్ర ప్రసాద్ 
ఫస్టాఫ్ 
 
డ్రా బ్యాక్స్ : 
 
సెకండాఫ్ 
 
నటీనటుల ప్రతిభ : 
 
రాజ్ తరుణ్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . అంధుడి గా కనిపించినంత సేపు నవ్వించి మెప్పించాడు . అలాగే ఎమోషనల్ సీన్స్ లో కూడా బాగానే చేసాడు . ఇక హెబ్బా పటేల్ యధావిధిగా  గ్లామర్ తో ఆకట్టుకుంది . రాజేంద్రప్రసాద్ టైమింగ్ కూడా బాగా సెట్ అయ్యింది . విలన్ గా రాజా రవీంద్ర సెట్ అయ్యాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
శేఖర్ చంద్ర సంగీతం ఫరవాలేదు , అలాగే ఛాయాగ్రహణం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది . నిర్మాణ విలువలు ఫరవాలేదు ఇక దర్శకుడు కం రచయిత విషయానికి వస్తే ........ ఫస్టాఫ్ ని ఎంటర్ టైన్ మెంట్ తో నడిపించిన వలిగొండ శ్రీనివాస్ సెకండాఫ్ కు వచ్చేసరికి తడబడ్డాడు .  అయితే మళ్ళీ క్లైమాక్స్ కు వచ్చేసరికి ప్రేక్షకులకు మంచి రిలీఫ్ నిచ్చాడు . ఓవరాల్ గా వలిగొండ సక్సెస్ అయ్యాడు . 
 
ఓవరాల్ గా : 
 
ఈ అంధగాడు భలే నవ్వించాడు 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD