Home రివ్యూస్ చుట్టాలబ్బాయి రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

చుట్టాలబ్బాయి రివ్యూ



Friday August 19th 2016

నటీనటులు : ఆది , సాయి కుమార్ , నమిత ప్రమోద్ తదితరులు 
సంగీతం : ఎస్ ఎస్ తమన్ 
నిర్మాతలు : వెంకట్ తలారి , రామ్ తాళ్ళూరి 
దర్శకత్వం : వీరభద్రం 
రేటింగ్ : 3/ 5

రిలీజ్ డేట్ : 19 ఆగస్టు 2016



 

Editor Review
అహనా పెళ్ళంట , పూల రంగడు వంటి హిట్స్ అందించిన వీరభద్రం చౌదరి భాయ్ తో ఫ్లాప్ ని ఎదుర్కొన్న తర్వాత కొంత గ్యాప్ తీసుకొని యంగ్ హీరో ఆది తో చేసిన సినిమా ''చుట్టాలబ్బాయి ''. వెంకట్ తలారి ,రామ్ తాళ్ళూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది మరి ఈ చిత్రంతో దర్శకులు వీరభద్రం ,హీరో ఆది సక్సెస్ అందుకున్నారా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే . 
 
కథ : 
 
బ్యాంక్ రికవరీ ఏజెంట్ బాబ్జీ (ఆది ) ఒక సందర్భంలో ఏసిపి చెల్లెలు కావ్య (నమిత ప్రమోద్ ) ని కలుస్తాడు ,అయితే బాబ్జీ ని కావ్య ని చూసిన ఏసిపి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని భ్రమపడి బాబ్జీ ని టార్గెట్ చేస్తాడు . అయితే అదే సమయంలో పెళ్లి ఇష్టం లేని కావ్య ఇంటి నుండి పారిపోయి బాబ్జీ తో వాళ్ళ సొంతూరు కు వస్తుంది . ఇంటికెళ్ళిన బాబ్జీ కి ఎటువంటి సమస్యలు ఏర్పడ్డాయి . ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నాడు ? చివరకు బాబ్జీ - కావ్య ఒక్కటయ్యరా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
ఫస్టాఫ్ 
30 ఇయర్స్ పృథ్వీ 
నిర్మాణ విలువలు 
 
డ్రా బ్యాక్స్ : 
 
అలీ కామెడి 
 
నటీనటుల ప్రతిభ : 
 
బ్యాంక్ రికవరీ బాబ్జీ గా ఆది మెరుగైన నటన ప్రదర్శించాడు . డ్యాన్స్ లోనే కాకుండా కామెడి లో కూడా మంచి పరిణితి సాధించాడు . హీరోయిన్ విషయానికి వస్తే అందంగా ఉంది , అందాలు చూపించింది కానీ నటనలో ఇంకా రాణించాల్సి ఉంది . ఎంటర్ టైన్మెంట్ విషయానికి వస్తే 30 ఇయర్స్  పృథ్వీ కామెడి పేలింది . సాయి కుమార్ -ఆది కలిసి కనిపించే సన్నివేశాలు . 
 
సాంకేతిక వర్గం : 
 
ఛాయాగ్రహణం , సంగీతం బాగున్నాయి , నిర్మాతలు పెట్టిన ఖర్చు ని తెరమీద చూపించడం లో కృతక్రుత్యులయ్యారు . నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక దర్శకులు వీరభద్రం విషయానికి వస్తే ............... ఫస్టాఫ్ ని ఎంటర్ టైన్మెంట్ జోడించి ముందుకు తీసుకెళ్లడం లో సఫలం అయ్యాడు , సెకండాఫ్ కు వచ్చేసరికి అనుకున్న స్థాయిలో రాణించలేక పోయాడు . పైగా సాయి కుమార్ -ఆది ల కాంబినేషన్ లో సీన్లు ఉన్నాయంటే సహజంగానే కొద్దిగా ఎక్కువగా ఎక్స్ పెక్ట్ చేస్తారు . 
 
ఓవరాల్ గా : 
 
ఫస్టాఫ్ వినోదాన్ని మేళవించిన చుట్టాలబ్బాయి లో 30 ఇయర్స్ పృథ్వీ , శకలక శంకర్ కామెడి , ఆది నటన , నమిత ప్రమోద్ గ్లామర్ వెరసి ఓ సారి చూడొచ్చు . గతకొంత కాలంగా హీరో ఆది డైరెక్టర్ వీరభద్రం లు సక్సెస్ కోసం ఆరాట పడుతున్నారు . వాళ్ళకు ఈ చుట్టాలబ్బాయి ఘనవిజయాన్ని అందించక పోయినప్పటికీ ఓ మోస్తరు విజయం అందించడం ఖాయమని అంటున్నారు . 
Comments

LATEST GALLERY


Chetana Uttej New Stills


Sunny Wayne New Stills


Dharma Yogi Audio Launch


Manjusha Latest Stills


ISM Movie Press Meet


Remo Movie Posters


Aditi Arya New Stills


Meelo Evaru Kotiswarudu working stills


Shravya New Photos


Nitya Naresh Latest Stills


Janatha Garage 50 Day Poster


Balakrishna visits Amitabh Sarkar 3 sets


Sruthi Sodi New Stills


Saloni Latest Pics


Deeksha Panth New Stills

FOLLOW
 TOLLYWOOD
టాప్
 స్టోరీస్
Read More..