Home రివ్యూస్ గౌతమ్ నంద రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

గౌతమ్ నంద రివ్యూ



Friday July 28th 2017

నటీనటులు : గోపీచంద్ , హన్సిక , కేథరిన్ తదితరులు 
సంగీతం :ఎస్ ఎస్ తమన్ 
నిర్మాతలు : జె . భగవాన్ ,జె పుల్లారావు 
దర్శకత్వం : సంపత్ నంది 
రేటింగ్ : 2. 75/ 5
రిలీజ్ డేట్ : 28 జూలై 2017


 

Editor Review
గతకొంతకాలంగా సరైన విజయం లేక సతమతం అవుతున్న గోపీచంద్ నటించిన గౌతమ్ నంద ఈరోజు రిలీజ్ అయ్యింది . సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
బిలియనీర్ ఘట్టమనేని విష్ణు ప్రసాద్ ( సచిన్ కెడ్కర్ )వారసుడు గౌతమ్ ( గోపీచంద్ ) . పార్టీ , పబ్ లంటూ తిరిగే గౌతమ్ ని అసలు నువ్వు ఎవరు ? అంటూ ప్రశ్నించడంతో తనని తాను తెలుసు కోవడానికి వెళుతున్న సమయంలో అచ్చం తన లాగే ఉండే నంద ( గోపీచంద్ )పేదరికం తో బాధపడుతూ ఆత్మహత్య కు ప్రయత్నిస్తాడు . దాంతో నెల రోజుల పాటు గౌతమ్ గా రాజభోగాలు అనుభవించు నేను పేదవాడిగా హైదరాబాద్ వెళతానని చెప్పి ఒకరి ప్లేస్ లోకి మరొకరు వెళతారు గౌతమ్ , నంద లు . అయితే గౌతమ్ ఆస్థులను కొట్టెయ్యడానికి ముద్ర ( ముఖేష్ ఋషి ) గౌతమ్ ని చంపించాలనుకుంటాడు . నెల రోజుల ఒప్పందం మేరకు గౌతమ్ , నంద లు మారిపోయారా ? నంద ప్రవర్తనలో వచ్చిన మార్పు ఏంటి ? చివరకు ఏమైంది అన్నదే మిగతా కథ . 
 
హైలెట్స్ : 
 
గోపీచంద్ 
కేథరిన్ గ్లామర్ 
నిర్మాణ విలువలు 
 
డ్రా బ్యాక్స్ : 
 
కథ 
 
నటీనటుల ప్రతిభ : 
 
స్టైలిష్ లుక్ లో గోపీచంద్ బాగున్నాడు , పైగా రెండు పాత్రల కోసం చేసిన హోమ్ వర్క్ బాగానే చేసినట్లుంది . గౌతమ్ గా నంద గా రెండు పాత్రల్లోనూ మెప్పించాడు ఇక తనకు బాగా అచ్చినచ్చిన విలనిజం  ని నంద పాత్రలో మెప్పించాడు గోపీచంద్ . కేథరిన్ కు నటనకు పెద్దగా స్కోప్ లేదు కానీ గ్లామర్ కు కొదవేం లేదు పైగా బికినితో  కురాళ్లకు గాలం వేసి సక్సెస్ అయ్యింది . హన్సిక పాత్ర కూడా పరిమితమే . ఇతర పాత్రల్లో సచిన్ కెడ్కర్ , చంద్రమోహన్ తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
 
గౌతమ్ నంద సినిమాకు మేజర్ హైలెట్ సినిమాటోగ్రఫీ . సుందర్ రాజన్ అందించిన ఛాయాగ్రహణం సినిమాని మరో మెట్టు పై నిలబడేలా చేసింది . గౌతమ్ ఇంటిని గ్రాండ్ గా చూపించి గ్రాండియర్ తీసుకొచ్చాడు . తమన్ అందించిన పాటలకంటే నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది . నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా స్క్రీన్ పై కనిపించింది కాబట్టి నిర్మాణ విలువల గురించి కొత్తగా చెప్పేదేముంది భారీ తనం అంటే ఏమిటో చూపించారు . నిజంగా గోపీచంద్ ని సంపత్ నంది ని నమ్మి ఇంతగా ఖర్చు పెట్టారంటే గ్రేటే ! ఇక దర్శకుడు సంపత్ నంది విషయానికి వస్తే ... .... గోపీచంద్ ని అద్భుతంగా చూపించి సక్సెస్ అయ్యాడు . 
 
ఓవరాల్ గా : 
 
గౌతమ్ నంద ఓవరాల్ గా ఓకే 
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD