గల్ఫ్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

గల్ఫ్ రివ్యూ

Murali R | Published:October 14, 2017, 9:24 AM IST

నటీనటులు : చేతన్ , సంతోష్ పవన్ , డింపుల్ హయతి తదితరులు 
సంగీతం: ప్రవీణ్ 
నిర్మాతలు : రవీంద్ర బాబు , రామ్ కుమార్ 
దర్శకత్వం : పి . సునీల్ కుమార్ రెడ్డి 
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 13 అక్టోబర్ 2017


 

Editor Review
గంగపుత్రులు వంటి సామాజిక స్పృహ ఉన్న చిత్రాన్ని అందించిన సునీల్ కుమార్ రెడ్డి తాజాగా తెలుగువాళ్లు గల్ఫ్ దేశాల్లో పడుతున్న ఇబ్బందులను ఇక్కడి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో చేసిన ప్రయోగమే ఈ గల్ఫ్ . ఈరోజు రిలీజ్ అయిన గల్ఫ్ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించేలా ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
చదువు పెద్దగా అబ్బని శివ ( చేతన్ ) తన స్నేహితుడు గల్ఫ్ లో ఉండటంతో డబ్బు సంపాదించడం కోసం గల్ఫ్ కు వెళ్తాడు , అదే ఫ్లయిట్ లో లక్ష్మి ( డింపుల్ హయతి ) కూడా గల్ఫ్ కు వెళుతుంది . అయితే అక్కడకి వెళ్ళగానే పాస్ పోర్ట్ లు తీసుకొని పనిలో పెట్టుకుంటారు . గల్ఫ్ లో మనవాళ్ళ బానిస బతుకులు ఎలా ఉన్నాయో తెలుసుకొని బాధపడతాడు , అయితే సాటి స్నేహితుడి చెల్లి పెళ్లి కోసం మేస్త్రీ ని డబ్బులు అడిగితే ఇవ్వడు దాంతో మన కష్టాన్ని డబ్బుగా మార్చితే వాళ్ళ ఇనప్పెట్టె లో పెట్టుకోవడం ఏంటి ? అని ఆ డబ్బు ని దోచుకోవడానికి బయలు దేరుతారు గల్ఫ్ లో ఉన్న శివ అండ్ కో . శివ బ్యాచ్ కష్టాలు తీరాయా ? చివరకు ఏమైంది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .  
 
 
 
హైలెట్స్ : 
 
గల్ఫ్ జీవుల వెత ని కథగా ఎంచుకోవడం 
 
డ్రా బ్యాక్స్ : 
 
స్లో నెరేషన్ 
 
 
నటీనటుల ప్రతిభ : 
 
మొదటి సినిమాతోనే డింపుల్ హయతి కి మంచి పాత్ర లభించింది , నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించడంతో డీ గ్లామరస్ క్యారెక్టర్ అయినప్పటికీ మెరుగ్గా రాణించింది . శివ పాత్రలో  చేతన్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు . సంతోష్ కు చాలారోజుల తర్వాత మంచి పాత్ర లభించింది . పోసాని బ్రోకర్ పాత్రలో మెప్పించాడు . ఇక మిగిలిన పాత్రల్లో ఆయా నటీనటులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు . 
 
సాంకేతిక వర్గం : 
 
గల్ఫ్ దేశాల్లో షూటింగ్ ని చేయడం కొంత సాహసమే అని చెప్పాలి , అయినప్పటికీ సాహసోపేతంగా గల్ఫ్ బాధితుల జీవితాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికి మంచి ప్రయత్నమే చేసాడు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి . అయితే స్క్రీన్ ప్లే పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది . గల్ఫ్ సంబరంతో వెళుతున్న వారి జీవితాలు ఎలా ఉన్నాయని ప్రభుత్వాలకు చెప్పడంలో సక్సెస్ అయ్యాడు సునీల్ కుమార్ రెడ్డి . రవీంద్ర బాబు , రామ్ కుమార్ ల ధైర్యాన్ని కూడా మెచ్చుకోవాలి ఇలాంటి కథా చిత్రాన్ని నిర్మించినందుకు . నేపథ్య సంగీతం అంతంత మాత్రమే కానీ మూడు పాటలు బాగున్నాయి . ఛాయాగ్రహణం ఫరవాలేదు . 
 
ఓవరాల్ గా : 
 
గల్ఫ్ దేశాలకు డబ్బు సంపాదించాలి అని ఇక్కడ అప్పులు చేసి వెళుతున్న వాళ్ళ జీవితాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించిన కథే ఈ గల్ఫ్ . సామాజిక బాధ్యత తో ఈ చిత్రం రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాలను కాకపోయినా కొంతమందిని ఆలోచింపజేయడంలో మాత్రం సక్సెస్ అవుతుంది . 


Comments

LATEST GALLERY


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery


Shravya Rao Latest Stills


Vana Villu Movie Audio Launch

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD