జయదేవ్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

జయదేవ్ రివ్యూ

Murali R | Published:June 30, 2017, 12:00 AM IST

నటీనటులు   : గంటా రవి , మాళవిక , వినోద్ కుమార్ 
సంగీతం       : మణిశర్మ 
నిర్మాత         : అశోక్ కుమార్ 
దర్శకత్వం    : జయంత్ సి . పరాన్జీ 
రేటింగ్         : 2/ 5
రిలీజ్ డేట్    : 30 జూన్ 2017


 

Editor Review
వారసుల రాజ్యం అయిన సినిమా రంగంలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు తన తనయుడు గంటా రవి ని హీరోగా పరిచయం చేసిన సినిమా '' జయదేవ్ ''. జయంత్ సి . పరాన్జీ దర్శకత్వంలో అశోక్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈరోజు రిలీజ్ అయ్యింది . మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే . 

కథ :
 
 
సర్కిల్ ఇన్స్పెక్టర్ జయదేవ్ ( గంటా రవి ) తన సర్కిల్ లో ఓ పోలీస్ ఆఫీసర్ చనిపోవడంతో ఆ కేసుని టేకప్ చేస్తాడు . సిన్సియర్ పోలీస్ నిచంపింది లిక్కర్ డాన్ మస్తాన్ ( వినోద్ కుమార్ ) అని తెలుసుకొని అతడ్ని అరెస్ట్ చేస్తాడు . అయితే అడుగడుగునా అవినీతి రాజ్యమేలుతున్న ఈ సొసైటీ లో తాను సిన్సియర్ గా డ్యూటీ చేసినందుకు డిపార్టుమెంట్ జయదేవ్ ని సస్పెండ్ చేస్తుంది . దాంతో లిక్కర్ డాన్ ఆట కట్టించడానికి జయదేవ్ ఏం చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
హైలెట్స్ : లేవు 
డ్రా బ్యాక్స్ : కోకొల్లలు 
 
నటీనటుల ప్రతిభ : 
 
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో గంటా రవి తన పరిధి మేరకు నటించాడు . అయితే ఇంకా నటనలో మెరుగు పడాల్సిన అవసరం ఉంది . మొదటి చిత్రంలోనే యాక్షన్ ని ఎంచుకొని ఓ మంచి ప్రయత్నమే చేసాడు . తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా విభిన్నమైన చిత్రాలు ఎంపిక చేసుకుంటే బాగానే ఉంటుంది . ఇక హీరోయిన్ మాళవిక రాజ్ గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది .ఒకప్పటి హీరో  వినోద్ కుమార్ విలన్ గా నటించాడు కానీ తనదైన మార్క్ చూపించలేక పోయాడు . ఇక మిగిలిన పాత్రల్లో పోసాని , శివారెడ్డి , పరుచూరి , కాదంబరి తదితరులు తమతమ పాత్రల పరిధి మేరకు నటించారు . 
 
సాంకేతిక వర్గం : 
నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి , అయితే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన చిత్రమిది అంటే నమ్మలేం అలా ఉంది మరి ఈ సినిమా . ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన సినిమాని మరింత బెటర్ చేయాల్సింది పోయి పేలవమైన స్క్రీన్ ప్లే తో నీరసం వచ్చేలా చేసారు . ఓవరాల్ గా సాంకేతిక వర్గం లో రాణించింది ఒక్క మణిశర్మ మాత్రమే . 
 
ఓవరాల్ గా : 
 
మొత్తంగా జయదేవ్ నిరాశ పరిచే సినిమా


Comments

LATEST GALLERY


Hey Pillagada Movie Posters


Lakshmi Manchu Latest Gallery


Naga Chaitanya Savyasachi Frist Look


Nivetha Pethuraj New Photos


Napolean Movie Press Meet


80's South Actors Re-Union Party Pics


Mental Madilo Audio Pre -Release


Napoleon Movie Posters


Nagarjuna RGV New Movie Gallery


Mehreen Pirzada New Photos


RGV Nagarjuna Movie Opening


Jawaan Movie Pre Release Launch


Jawaan Audio And Pre Release Event Posters


Gopichand's 25th Film Opening Photos


Vishaka New Gallery

టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD