Home రివ్యూస్ ఖయ్యూమ్ భాయ్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

ఖయ్యూమ్ భాయ్ రివ్యూ



Friday June 30th 2017

నటీనటులు   : కట్టా రాంబాబు , తారకరత్న , బెనర్జీ తదితరులు 
సంగీతం       : శేఖర్ చంద్ర 
నిర్మాత         : కట్టా శారద 
దర్శకత్వం   : భరత్ పారేపల్లి 
రేటింగ్         : 2. 75/ 5
రిలీజ్ డేట్   : 30 జూన్ 2017


 

Editor Review
తెలుగు రాష్ట్రాలలో నరహంతకుడు నయీమ్ సాగించిన హత్యాకాండ వింటే ఒళ్ళు గగుర్పొడచడం ఖాయం , అతడు ఈ స్థాయికి చేరుకున్నాడంటే అసలు ప్రభుత్వం ఉందా ? పోలీసులు ఏం చేస్తున్నారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది . రెండు తెలుగు రాష్ట్రాలను వణికించిన నయీమ్ కథ తో తెరకెక్కిన చిత్రమే ఈ ''ఖయ్యూమ్ భాయ్ ''. మరి ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే . 
 
కథ : 
 
ఖయ్యూమ్ భాయ్ ( కట్టా రాంబాబు ) నరహంతకుడు . సెటిల్ మెంట్లు చేస్తూ , బాగా డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ నచ్చని వాళ్ళని  అతి కిరాతకంగా చంపేస్తూ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాడు . ఖయ్యూమ్ భాయ్ అరాచకాలు ఎక్కువ కావడంతో అతడ్ని అంతం చేయడానికి రంగంలోకి దిగుతాడు పోలీస్ ఆఫీసర్ ( తారకరత్న ) . ఖయ్యూమ్ భాయ్ ని పోలీసులు ఎలా అంతం చేసారు ? అతడు సాగించిన రాక్షస కాండ ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే . 
 
హైలెట్స్ : 
ఖయ్యూమ్ భాయ్ పాత్రధారి కట్టా రాంబాబు 
 
డ్రా బ్యాక్స్ : 
 
స్క్రీన్ ప్లే 
 
నటీనటుల ప్రతిభ :
   ఖయ్యూమ్ భాయ్ గా కట్టా రాంబాబు బాగా నటించాడు. నయీమ్ పాత్రలో మెప్పించి అచ్చం నయీమ్ ని తలపించాడు.నటనకు కొత్తవాడు అయినప్పటికీ నయీమ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసాడు కట్టా రాంబాబు .  ఏసీపీ పాత్రలో తారకరత్న , అలాగే ఇతర పాత్రల్లో  నటించిన నటీనటులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం : 
   నిర్మాణ విలువలు ఫరవాలేదు, ఖర్చుకు వెనుకాడకుండా బాగానే ఖర్చు పెట్టారు .  భరత్ దర్శకుడి గా మరోమారు ఫెయిలయ్యాడు. అతడి టేకింగ్ అన్నది ఏమిటో తెలిసినప్పటికీ మళ్లీ మళ్లీ సినిమాలు వస్తున్నాయంటే గ్రేటే, సంచలన సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని మరింత రక్తి కట్టించి ఉంటే ఖచ్చితంగా సినిమా మంచి హిట్ అయ్యుండేది . ఖయ్యూమ్ భాయ్ పాత్రని మరింతగా ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది . శేఖర్ చంద్ర అందించిన సంగీతం పాటల వరకు ఓకే .  ఇక మిగతావి చెప్పుకోవడానికి ఏమి లేదు.
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD