Home రివ్యూస్ లవర్ బాయ్ రివ్యూ
టాలీవుడ్
 రివ్యూస్

లవర్ బాయ్ రివ్యూSaturday April 22nd 2017

నటీనటులు   : సంజీవ్ నాయుడు , ప్రియాంక 
సంగీతం       : అమన్ 
దర్శకత్వం    : సంజీవ్ నాయుడు 
రేటింగ్        : 2 / 5 
రిలీజ్ డేట్    : 21 ఏప్రిల్ 2017


 

Editor Review
సంజీవ్ నాయుడు కథ, మాటలు, ఎడిటింగ్, డైరెక్షన్ తో పాటు హీరోగా నటించిన చిత్రం లవర్ బాయ్. కొత్త దర్శకుడైనప్పటికీ ఓ యూనిక్ కాన్పెప్ట్ ని ఎంచుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. యశోజయ క్రియేషన్స్ బ్యానర్ పై జయ హరనాథ్ నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రియాంక మెయిన్ హీరోయిన్ కాగా సోనియా చౌదరి మరో ఇంపార్టెంట్ హీరోయిన్ గా నటించింది. మ్యూజిక్ అమన్ అందించాడు. లవర్ బాయ్ వంటి యూత్ ఫుల్ టైటిల్ పెట్టిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఎంటర్ టైన్ చేసిందో చూద్దాం.
 
కథేంటంటే... హీరో(సంజీవ్ నాయుడు) కాలేజ్ స్టూడెంట్. డిఫరెంట్ ఆటిట్యూడ్ ఉంటుంది. కానీ స్త్రీ లంటే మాత్రం ఎనలేని గౌరవం. ఆ గౌరవంతో హీరోయిన్ (ప్రియాంక) ప్రేమలో పడుతుంది. అయితే అనురాగ్ చేసే ఓ పనితో హీరోయిన్ కు హీరోపై చెడు అభిప్రాయం కలుగుతుంది. అంతేకాదు... తాను ఆవేశపరుడని, అందరితో గొడవలు పడతాడని హేట్ చేస్తుంది. తాను ఎలాంటి తప్పుచేయలేదని చెప్పినా హీరోయిన్ నమ్మదు. ఈ క్రమంలో చీకటి గూడెం అనే గ్రామంలో నెలరోజులు ఎలాంటి గొడవలకు దిగకుండా ఉండాలని చెబుతుంది. అలా ఉంటేనే తన ప్రేమను అంగీకరిస్తానని అంటుంది. గుండాయిజం చేస్తూ, రౌడీయిజం చాలయించే మనుషుల మధ్యలో హీరో నెల రోజులు ఎలా ఉన్నాడు. తన ప్రేమను ఎలా బతికించుకున్నాడు. తన మీద ఉన్న ముద్రను ఎలా చెరిపేసుకున్నాడు. ఊర్లో ఉన్న సమస్యల్ని ఎలా తీర్చాడన్నది మాత్రం తెరమీదే చూడాలి.
 
సమీక్ష
సంజీవ్ నాయుడు అన్నీ తానై ఈ సినిమాను భుజాల మీదేసుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథ, కథనం రాసుకున్నాడు. ప్రథమార్థంలో యూత్ కి నచ్చే విధంగా పాటలు, ఫైట్లు, కామెడీ, లవ్ ట్రాక్స్ తో ఎంటర్ టైన్ చేశాడు. రెండో భాగంలో ఓ సామాజిక కోణాన్ని చూపించాడు. తనను తాను నియంత్రించుకుంటూనే తన ప్రేమను బ్రతికించుకుంటూనే ఉరి సమస్యను తన సమస్యగా తీర్చడమనే కాన్పెప్ట్ కొత్తగా ఉంటుంది. హీరోయిన్ ప్రియాంక సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. చూడటానికి అందంగా ఉండడమే కాకుండా క్యారెక్టర్ కు తగ్గట్టుగా హావభావాల్ని చూపించింది. హీరోను మార్చే సీన్స్ లో ప్రియాంక నటన బాగుంది. ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్ మథ్య వచ్చే సీన్స్ బాగా రాసుకున్నారు. అనంత్, గుండు హనుమంతరావు, జబర్దస్త్ సన్నీతో పాటు విలన్ టీంకు మంచి పేరొస్తుంది. సోనియా చౌదరి తన క్యారెక్టర్ కు న్యాయం చేసింది. అమన్ అందించిన పాటలు బాగున్నాయి. శ్రియా ఘోషల్, ఉదిత్ నారాయణ్ వంటి సీనియర్ సింగర్స్ పాడటం విశేషం. అమ్మాయిల్ని మాత్రమే ప్రేమిస్తే లవర్ బాయ్ కాలేడని.. సమాజంలోని ప్రతీ ఒక్కరు ప్రేమించేలా మంచి పనులు చేస్తేనే లవర్ బాయ్ గా పిలిపించుకుంటారనే కాన్పెప్ట్ ను దర్శకుడు బాగా ఎలివేట్ చేశాడు. హీరోయిన్ ఎదపై ఉంటే పుట్టుమచ్చను హైలైట్ చేస్తూ రాసుకున్న సీన్స్ హైలైట్ గా నిలిచాయి. దీంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ ను జోవియల్ గా మిలిచారు. హీరో డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. 
ఓవరాల్ గా ... యూత్ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఓ మంచి కాన్పెప్ట్ ను ఎంచుకొని తెరకెక్కించిన చిత్రమిది. సంజీవ్ నాయుడు నటన హైలైట్ గా నిలుస్తూ... మంచి పాటలు, ప్రియాంక నటన, సెకండాఫ్ కాన్సెప్ట్ సినిమాకు హైలైట్. ఈ లవర్ బాయ్ మూమూలు లవర్ మాత్రం కాదు
టాప్
 స్టోరీస్
Read More..
FOLLOW
 TOLLYWOOD